Trending

6/trending/recent

Stock Market Update:ఒమిక్రాన్ దెబ్బ.. బెంబేలెత్తిన స్టాక్ మార్కెట్..

వరుసగా రెండోరోజూ మార్కెట్లు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో, మార్కెట్లు హడలెత్తుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా డౌనయ్యింది. నిఫ్టీ కూడా 17 వేలకు కిందకి దిగొచ్చింది.

  • సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా డౌన్
  • నిఫ్టీ కూడా కిందకే
  • ఇన్వెస్టర్లకు రూ.4.2 లక్షల కోట్లు లాస్
  • నెగిటివ్‌గా ఉన్న గ్లోబల్ సంకేతాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్లు భయాందోళనకు గురవుతున్నాయి. వరుసగా రెండో రోజూ మన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రాషయ్యాయి. సోమవారం సెన్సెక్స్ 949.32 పాయింట్లు పడిపోయి 56,747.14 వద్ద సెటిలైంది. నిఫ్టీ కూడా 284.45 పాయింట్లు దిగొచ్చి, 17 వేల కిందకి పడిపోయి 16,912.25 వద్ద నమోదైంది.

మార్కెట్ల క్రాష్‌తో ఇన్వెస్టర్లు భారీగా తమ సంపదను నష్టపోవాల్సి వచ్చింది. మార్కెట్ నుంచి రూ.4.29 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడైంది. నేటి మార్కెట్‌లో ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టాల పాలయ్యాయి. ఐటీ స్టాక్స్‌తో పాటు ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా స్టాక్స్ కూడా ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. ఇండియాలో పెరుగుతోన్న ఒమిక్రాన్ కేసులతో పాటు, గ్లోబల్‌గా వస్తోన్న సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, దేశాల మధ్య ఆంక్షలు పెరుగుతుండటంతో మార్కెట్లు నష్టాల బాట పట్టినట్టు మార్కెట్ విశ్లేషకులంటున్నారు.

మరోవైపు కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ వెలువరించే నిర్ణయంపై కూడా మార్కెట్లు వేచి చూస్తున్నట్టు ఎల్‌కెపి సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ చెప్పారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆర్‌బీఐ మీటింగ్ నేటి నుంచి(సోమవారం నుంచి) ప్రారంభమైంది. రోజంతా బేర్స్ పైచేయిగా నిలిచి, మార్కెట్‌లో ఎలాంటి రికవరీ కనిపించలేదు. అటు గ్లోబల్ మార్కెట్లు కూడా నెగిటివ్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్ గత సెషన్‌లో నష్టాలలో ముగిసింది.

Stock Market Update:ఒమిక్రాన్ దెబ్బ.. బెంబేలెత్తిన స్టాక్ మార్కెట్..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad