Trending

6/trending/recent

RRR movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. బందోబస్త్‌ కావాలంటోన్న థియేటర్ల ఓనర్లు..

టాలీవుడ్‌తో యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు

లీవుడ్‌తో యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియా శరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషలలో రిలీజ్ కానున్న ఈ పాన్‌ ఇండియా సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ రేపు ( డిసెంబర్ 9) న విడుదల కానుంది.

కాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు వందల థియేటర్లు ఈ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో తమ రెండు థియేటర్లకు భద్రత కావాలని వైజాగ్‌కు చెందిన థియేటర్స్ సంగం, శరత్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారు ఓ వినతి పత్రాన్ని పోలీసులకు అందజేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండడం వల్లే ముందస్తు జాగ్రత్తగా బందోబస్త్ కోసం వినతి పత్రాన్ని అందించినట్లు థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కాగా ఇంతకముందు ఇదే థియేటర్స్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసినపుడు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో థియేటర్‌ అద్దాలు కూడా పగిలిపోయి..కొందరు అభిమానులు గాయాలపాలయ్యారు కూడా. అందుకే ఈసారి అలా జరగకుండా జాగ్రత్తపడేందుకే థియేటర్స్ యాజమాన్యం ఇలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

RRR movie Trailer: ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌.. బందోబస్త్‌ కావాలంటోన్న థియేటర్ల ఓనర్లు..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad