Trending

6/trending/recent

PRC - పీఆర్సీ గ్యారెంటీ.. గడువు లోగా ఇస్తాం

  •  పీఆర్సీ గ్యారెంటీ
  • కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నది ఉద్యోగులకూ తెలుసు :  సజ్జల

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కచ్చితంగా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

'ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ప్రభుత్వ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వారే. అలాంటి ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమే ఉంటుంది తప్ప కోపం ఉండదు' అని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఎవరూ అడగకుండానే ఉద్యోగులకు 27% ఐఆర్‌ (మధ్యంతర భృతి) ఇచ్చారని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు పీఆర్సీని వేయడంలో తీవ్ర జాప్యం చేశారని, డీఏలు కూడా ఇవ్వలేదని ఎత్తిచూపారు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నది ఉద్యోగులకు తెలుసని, అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు పెంచామని గుర్తు చేశారు.

2018-19లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు రూ.32 వేల కోట్లు ఉంటే.. 2020-21కి రూ.50 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. వేతనాలు, డీఏ తదితరాలను పెంచడం వల్ల ఏడాదికి రూ.18 వేల కోట్ల మేర ఉద్యోగులకు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు సంయమనం పాటించాలని, గడవులోగా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. తాము తల్చుకుంటే ప్రభుత్వాలను కూల్చగలం.. నిలబెట్టగలమని నలుగురైదుగురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కావాలంటే వారు నలుగురూ రాజకీయ పార్టీలు పెట్టుకుని.. ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని సూచించారు.

PRC - పీఆర్సీ గ్యారెంటీ.. గడువు లోగా ఇస్తాం

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad