Trending

6/trending/recent

Pradhan Mantri Awaas Yojana:సొంతింటి కల నెరవేర్చుకునేవారికి శుభవార్త.. మరో మూడేళ్ల పాటు ఆ పథకం పొడిగింపు..

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు సైతం సొంతిల్లు ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం, లేక ఇళ్లు కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం..'ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(PMAY)'.

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు సైతం సొంతిల్లు ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం, లేక ఇళ్లు కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం..’ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(PMAY)’. అందరికీ పక్కా ఇళ్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించి కేంద్ర క్యాబినేట్‌ బుధవారం మరొక శుభవార్త చెప్పింది. మరో మూడేళ్ల పాటు అంటే మార్చి 2024 వరకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 155.75 లక్షల ఇళ్ల నిర్మాణాంతో పాటు 2.95 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ పథకం పొడిగింపు దోహదపడుతుందని కేంద్రమంత్రి తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంటున్న పరిస్థితుల్లో సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకం కోసం 2021 మార్చి వరకు గడువును ప్రకటించారు. అయితే తాజాగా మరో మూడేళ్ల పాటు అంటే మార్చి 2024 వరకు ఈ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది

Pradhan Mantri Awaas Yojana:సొంతింటి కల నెరవేర్చుకునేవారికి శుభవార్త.. మరో మూడేళ్ల పాటు ఆ పథకం పొడిగింపు..


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad