Trending

6/trending/recent

Gas Cylinder: మహిళలకు గుడ్ న్యూస్‌.. ఇకపై తగ్గనున్న గ్యాస్‌ ‘భారం’.. కేంద్రం కీలక నిర్ణయం.?

Gas Cylinder: గృహ అవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్‌ విషయంలో మహిళలకు కేంద్రం శుభ వార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ కీలక ప్రతిపాదన తమ వద్ద ఉన్నట్లు కేంద్రం తెలిపింది...

Gas Cylinder: గృహ అవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్‌ విషయంలో మహిళలకు కేంద్రం శుభ వార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ కీలక ప్రతిపాదన తమ వద్ద ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మహిళలకు తగ్గనున్న భారం అనగానే భారీగా పెరిగిన ధరలు తగ్గనున్నాయని అని అనుకుంటున్నారు కదూ.. అయితే మీరు పొరబడినట్లే ఎందుకంటే ఈ ప్రతిపాదన ధరల విషయంలో కాదు, బరువు విషయంలో. అవును మీరు చదివింది నిజమే. త్వరలోనే గ్యాస్‌ సిలిండర్‌ బరువు తగ్గే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సిలిండర్‌ బరువు ఎక్కువగా ఉండడంతో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. తాజాగా రాజసభ్యలో ప్రశ్నోత్తరాల సమయంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ సమాధానం ఇచ్చారు. మరి ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.

Gas Cylinder: మహిళలకు గుడ్ న్యూస్‌.. ఇకపై తగ్గనున్న గ్యాస్‌ ‘భారం’.. కేంద్రం కీలక నిర్ణయం.?


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad