Ads Area

Bigg Boss 5 Episode 95: షణ్ముఖ్ టైటిల్‌ని గంగలో కలిపేసిన ఎపిసోడ్.. నీఛమైన క్యారెక్టర్‌తో పాతాళానికి.. పాపం సిరి

సిరి విషయంలో షణ్ముఖ్ ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.. భయకరంగా ట్రోలింగ్ నడుస్తుంది. అయితే ట్రోలర్స్‌కి మరింత పనిచెప్తూ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతూ వరస్ట్‌గా బిహేవ్ చేశాడు షణ్ముఖ్.

బుధవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్ 95.. మానస్-కాజల్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చతో మొదలైంది. బయట ఆడియన్స్ ఏ ఇష్యూపై చర్చించుకుని హాట్ టాపిక్ అవుతుందో అదే ఇష్యూపై ముచ్చటించారు. షణ్ముఖ్.. సిరిని ప్రతి ఒక్క విషయంలో కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మానస్ కాజల్‌తో చెప్పగా.. అవును ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాడు. చెప్పి కంట్రోల్ చేయడం కాకపోవచ్చు.. చూపులతో కంట్రోల్ చేస్తున్నాడు.. సిరి చాలా మారిపోయింది.. ఇలా ఉంటే ఇండివిడ్యువాలిటీ కోల్పోతుంది కదా అని మానస్ అంటే.. ఈ హౌస్‌లో కొనసాగడానికి అలా చేస్తుందని నాకు అనిపించట్లేదు అని అంటుంది కాజల్.

షణ్ముఖ్ తప్పు చేసినా ఒప్పు చేసినా సిరి లైక్ చేస్తుంది.. కానీ ప్రతిదానికి ఒక లైన్ ఉంటుంది కదా.. ఆ లైన్ క్రాస్ చేసి ఇండివిడ్యువాలిటీ కోల్పోకూడదని చెప్తున్నా అని మానస్-కాజల్‌తో సిరి గురించి చర్చించాడు. ఇక్కడ వీళ్లు చర్చించుకుంటే.. లోపల సిరి-షణ్ముఖ్ పక్క పక్క బెడ్స్‌పై పడుకుని చీకట్లో ఏవో సైగలు చేసుకుంటూ కనిపించారు. ఆ ఉదయాన్ని అందరూ ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటకు డాన్స్ వేస్తూ కనిపిస్తే.. షణ్ముఖ్-సిరిలు హగ్ చేసుకుంటూ కనిపించారు. అదేనండీ ఫ్రెండ్ షిప్ హగ్.. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. కెమెరా దగ్గరకు వెళ్లి మమ్మీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అని అనలేదు.

నిన్న ‘అప్పడం’.. ఈరోజు ‘వారి వంట వారిదే’

బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన సంఘటనల్ని ఒక్కొక్కటిగా రీ క్రియేట్ చేస్తున్నారు. మూడో సంఘటనలో భాగంగా.. జెస్సీ-శ్రీరామ్‌ల మధ్య జరిగిన గొడవని రీక్రియేట్ చేయాలని చెప్పారు. శ్రీరామ్‌తో జరిగిన ఆర్గ్యూమెంట్‌లో భాగంగా.. సిరి, షణ్ముఖ్, జెస్సీలు వారి వంట వాళ్లే చేసుకుంటారు.. ఈ సందర్భంలో వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సంఘటనని మళ్లీ చేసి చూపించాలని చెప్పారు బిగ్ బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో సన్నీ.. షణ్ముఖ్‌ని ఇమిటేట్ చేసి వెకిలి కామెడీ చేశాడు. దీంతో షణ్ముఖ్ హర్ట్ అయిపోయాడు. సన్నీకి వెకిలికామెడీ చేయొద్దు.. ఓవరాక్షన్ వద్దని నిన్ననే చెప్పాడు.

అయితే నేటి ఎపిసోడ్‌లో సన్నీ.. జెస్సీ విషయంలో సిరి-షణ్ముఖ్ ఎలా ప్రవర్తించారో చేసి చూపిస్తూ వీళ్లిద్దరూ యూటర్న్ తీసుకుని వెళ్లిపోయారని వాళ్లని ఇమిటేట్ చేస్తాడు.. దీంతో షన్నూ సీరియస్ అయ్యాడు. ఇలాంటివి చేయొద్దని నిన్ననే చెప్పాను. జరగలేనిది చేస్తే నాకు నచ్చదు అని అంటాడు షన్నూ.

‘నేను కూల్‌గా ఉన్నా.. అనవసరంగా గొడవపడొద్దు.. సీరియస్ అవ్వొద్దు షణ్ముఖ్ అని సన్నీ చాలా కూల్‌గా చెప్పాడు.. నేనూ కూల్‌గానే ఉన్నాడు.. వెక్కిరిస్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు షణ్ముఖ్.. నేనేం వెక్కిరించా యూటర్న్ తీసుకుని వెళ్లావ్ అని చెప్పాను.. బరాబర్ వెళ్లావ్.. అన్నీ నువ్ చెప్పిందే రైట్ అంటే హౌస్‌లో నడవదు.. నిన్న కూడా ఇలాగే చేశావ్.. నేను ఇమిటేట్ చేయట్లేదు.. రీ క్రియేషన్ అంటే ఇలాగే ఉంటుంది’.. అంటూ సీరియస్ అయ్యాడు సన్నీ.

నాకు నచ్చదు ఇమిటేట్ చేస్తే అని చెప్తున్నా.. నువ్ చేయాలని ఫిక్స్ అయ్యావ్ కదా.. నేను నాకు నచ్చినట్టే ఉంటా అని చెప్తాడు షణ్ముఖ్.

దీంతో సన్నీ టెంపర్ రెట్టింపు అవుతుంది.. నాకు నచ్చదు అంటే కుదరదు.. మీరు చేయరు.. నేను చేస్తానంటే ఒప్పుకోరు.. ఇక్కడ బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలి.. నాకు నచ్చదు అంటూ ఇక్కడ కుదరదు.. నేను చేయను అని వెళ్లి బిగ్ బాస్‌తో చెప్పుకో’ అని సీరియస్ అయ్యాడు సన్నీ. దీంతో షణ్ముఖ్.. అయితే నేను చేయను.. అంటూ అక్కడ నుంచి లేచివెళ్లిపోయి.. ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు.. అని చెప్తాడు.


ఇక కిచెన్‌లో దోసెలు వేస్తున్న కాజల్.. సిరి ఉండగా.. ‘షణ్ముఖ్ ఏం మాట్లాడుతున్నాడు.. నీకు యాక్టింగ్ ఇష్టం కదా చేసుకో.. తక్కువ చేయడమే ఇన్ టెన్షన్ అని అనడం వెరీ రాంగ్’ అని అంటుంది. దీంతో వెంటనే సిరి రియాక్ట్ అవుతుంది.. అది వాళ్ల పాయింట్.. రైటా రాంగా అని మనం చెప్పకూడదు.. తప్పు చేయకపోతే నిన్న సన్నీ షన్నూకి సారీ ఎందుకు చెప్తాడు అని అన్నది.

మరోవైపు.. సన్నీ లోపలికి వెళ్లి నేనేం అన్నారా? యూటర్న్ తీసుకున్నారని అంటే తప్పా? అని అడుగుతాడు. దీంతో మానస్.. ఆ మాట తప్పుకాదు కానీ.. నువ్ ఇమిటేట్ చేశావ్.. అదే వాడికి కాలింది.. నీ మనసులో వాళ్లని హర్ట్ చేయాలని లేకపోయినా నువ్ చెప్పిన విధానం అయితే అలాగే ఉంది అంటూ మానస్ బ్యాలెస్డ్‌గా మాట్లాడాడు. అయితే కాజల్ మాత్రం సన్నీ చేసిన దాంట్లో తప్పులేదని చెప్పింది.

ఇక సిరి.. షణ్ముఖ్ దగ్గరకు వచ్చి అతన్ని కన్వెన్స్ చేయడానికి ట్రై చేసింది.. నువ్ డైవర్ట్ కాకు.. ఆ టాస్క్ చేయాలి కదా.. రా చేద్దాం అని అంటుంది. నేను చేయను.. నా వల్ల కాదని అంటాడు షణ్ముఖ్. ‘ఆ ఇమిటేషన్స్ తట్టుకోవడం నా వల్ల కాదు.. సన్నీ నిన్న నన్ను చాలా తక్కువ చేశాడు.. ఇమిటేట్ చేయడం నాకు నచ్చదు..’ అని చెప్తాడు షన్నూ.

సర్లే సారీ చెప్పాడు కదా.. అతను చేస్తున్నాడని మనం చేయలేం కదా.. ఇది అందరూ కలిసి ఆడాల్సిన గేమ్ కదా అని సిరి అంటే.. నువ్ నన్ను దొబ్బకు.. చిరాకు రప్పించకు.. మీకందరికీ లిమిటేషన్స్ ఉంటాయి.. వాటిని దాటకూడదు.. ఎన్నిసార్లు చెప్పాలి.. మనిషే కదా.. అంటూ సిరిపై సీరియస్ అవుతాడు షణ్ముఖ్. టాస్క్ చేయనంటే ఎట్లా అవుతుంది.. బిగ్ బాస్ చెప్తాడు చేయాలని అప్పుడు ఏం చేస్తావ్ అని సిరి అనడంతో.. ‘హే చేయను.. నా ఇష్టం బే.. ’ అని అంటాడు షన్నూ.

నీ ఇష్టం అంటే కుదరదు.. గేమ్‌లో గొడవ అయితే గేమ్ ఆడటం మానేస్తావా? అని సిరి అనడంతో.. ఎక్స్ ట్రా చేయకు సిరీ.. నీ పని నువ్ చూసుకో అని అతి చేస్తాడు షణ్ముఖ్. ఆ తరువాత ‘నన్ను మాటలు అన్నా పడ్డాను.. ఇలా ఇమిటేట్ చేస్తే నాకు నచ్చదు.. నేను తీసుకోలేను’ అని బిగ్ బాస్‌తో చెప్తాడు షన్నూ. ఆ తరువాత మానస్ వచ్చి... షన్నూని గేమ్ ఆడటానికి రమ్మని పిలుస్తాడు. నేను రాను బ్రో అని అంటాడు. ఏదో ఫ్లోలో అన్నాడులే రా.. ఆర్టిస్ట్‌లకు అలా ఫ్లోలో వచ్చేస్తుంది అని మానస్ అనగా.. నేనూ ఆర్టిస్ట్‌నే.. సన్నీ చేసేదాన్ని జనాలు ఎంజాయ్ చేస్తారు.. దాన్ని నేను కాదనడం లేదు.. బట్ అది నాకు నచ్చదని చెప్తున్నా.. నేనేం చేయలేను’ అంటూ ఇగో ఫీల్ అవుతాడు షణ్ముఖ్. ఆ తరువాత శ్రీరామ్ వచ్చి కన్వెన్స్ చేయడంతో.. బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి చేయడం తప్పదు.. కాసేపు టైం కావాలని అంటాడు షణ్ముఖ్.

ఇంతలో సన్నీ.. హమీదా గెటప్ వేసుకుని వచ్చి షన్నూకి ఎదురుగా నిలబడంతో.. షన్నూ సన్నీని అనలేక.. పక్కనే ఉన్న సిరిపై విరుచుకుపడతాడు.. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావ్.. టాస్క్ ఆడాలని బిగ్ బాస్ చెప్తున్నాడని నువ్ నాకు చెప్తున్నావ్ ఏంటి.. గేమ్ ఆడటం నాకు తెలియదా.. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు.. స్పేస్ ఇవ్వాలి.. అని అరుస్తాడు.

అయితే టాస్క్ ఆడమని నేను వచ్చి చెప్తే.. నా మీద అరిచావ్.. ఇప్పుడు శ్రీరామ్ వచ్చి చెప్తే ఆడుతున్నావ్.. బిగ్ బాస్‌తో నువ్ చెప్పించుకోకూడదని.. ముందే నేను వచ్చి గేమ్ ఆడమని చెప్పా.. కానీ నువ్ నా మాట తప్ప అందరి మాట వింటావ్ అని ఇప్పుడు అర్థమైంది అని సిరి కౌంటర్ ఇస్తుంది. ‘నీకు ఇదే అర్థమైంది.. ఇదే నీ ఫ్రెండ్ షిప్.. నువ్వే కరెక్ట్.. నీ స్టేట్ మెంట్ కరెక్ట్.. అందరూ నచ్చింది చేసుకోండి’ అని అన్నాడు షణ్ముఖ్. నీతోనే కాదు.. సన్నీతో కూడా మాట్లాడా.. సన్నీపై కూడా అరిచా అని సిరి అనడంతో.. అంటే సన్నీ నేను ఒకటేనా? అవతల వాడికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇవ్వడం లేదు.’ అని అమ్మలక్క మాటలు మాట్లాడతాడు షణ్ముఖ్.

అయితే అక్కడే ఉన్న సన్నీ.. హమీదా గెటప్‌లో ఉండి.. మనికి ఎవరిమీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ల మీద అరుస్తాది.. అని సెటైర్ వేస్తాడు.. ఆ మాటతో దోసెలు వేస్తున్న షణ్ముఖ్‌కి సర్రున కాలుతుంది.. వెంటనే అక్కడ నుంచి లేచివెళ్లిపోతుంటాడు. ఇంతలో సిరి.. ‘సన్నీ నువ్వు ఒక్కటే ఎలా అవుతారు షన్నూ.. ప్రతిదీ నెగిటివ్‌గా తీసుకుంటావ్.. సిరి అంటే నెగిటివ్.. నెగిటివ్ అంటే సిరి అన్నట్టుగా మాట్లాడతావ్..’ అని అనడంతో.. షణ్ముఖ్ పిచ్చెక్కినట్టు అరుస్తాడు.. నువ్ చెప్పింది నెగిటివ్‌నే.. కాజల్ నాపై వాగుతుంది.. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్’ అని అరుస్తాడు.

పాపం తరువాత కూడా సిరిని మానసికంగా టార్చర్ చేయడం ఆపలేదు షణ్ముఖ్. ‘నిన్ను ఎందుకు తక్కువ చేస్తా.. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్’ అని సిరి షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి హగ్ కోసం ప్రాధేయపడుతూ.. చేతులు చాపుతుంది.. ఆమె ఫ్రెండ్ షిప్ హగ్‌ని తీసుకోకుండా ఈసారి మాత్రం ఆమెను వెనక్కి నెట్టేస్తాడు షణ్ముఖ్. సారీ రా బాబూ.. క్షమించు అని చేతులెత్తి దండం పెడుతుంది సరి.. అయినప్పటికీ షణ్ముఖ్ సిరి సాధించడం ఆపలేదు.. ‘నువ్ ఎవరికో ఎమోషనల్ కనెక్ట్ అయితే ఆపాను.. నిన్ను వాడెవడో అప్పడం అంటే డిఫెండ్ చేశా.. మీ అమ్మ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడింది. నేను నెగిటివ్ అవ్వట్లేదు.. నేను నెగిటివ్‌గా ఆలోచిస్తున్నానా.. నీ వల్ల నాకు నెగిటివ్ అవ్వలేదా? నీ మంచి కోసం మాట్లాడితే నన్ను నెగిటివ్ అంటావా? నీకు మాత్రం ప్రతిదీ నీకు నచ్చినట్టే అవుతుంది.. అవతల వాడి ఎమోషన్ మాత్రం నీకు గుర్తు ఉండదు.

అన్నీ నీ ఇష్టమే.. ఇక్కడ నుంచి వెళ్లిపో.. మిగతా హౌస్ మేట్స్ అందరూ ఎలాగో నువ్వూ అంతే.. నీ కాలుకి దెబ్బ తగిలితే నేను ఆయింట్మెంట్ రాశాను.. దానికి నువ్ ఇస్తున్న రెస్పెక్ట్ ఇదీ.. నేను వందసార్లు ఫ్రెండ్ షిప్ గురించి చెప్పుకోను.. నెగిటివ్‌గా ఆలోచిస్తున్నాడు అని నేను అనను.. నువ్ నాకు అవసరం లేదు.. నువ్ నాతో మాట్లాడొద్దు.. వెళ్లిపో.. నా ఎమోషన్ నీకు ఎప్పుడూ గుర్తుకు రాదు.. నువ్ నాకోసం ఏమీ చేయలేదు.. ప్రతిదానికి నువ్వే కరెక్ట్.. నేను కోపంలో మాట అనేస్తా.. నువ్వే గెలుస్తావ్.. అవతల వాడిని ఆయన ఆయన అంటావ్.. నన్ను అరేయ్ అంటావ్.. వెళ్లు బే అంటావ్.. అంత చనువు ఇచ్చాను నీకు.. మినిమమ్ రిస్పెక్ట్ ఇవ్వవు.. నేను నీ గురించి ఎంతో ఏడుస్తు.. ఎవడైనా గోకుతుంటే ఆపుతా.. అవతల వాడి ముందు నేను తక్కువైనా పర్లేదు అని నేను అనుకుంటా.. మీ మమ్మీకి ఇవన్నీ గుర్తులేవు.. హగ్ ఒక్కటే గుర్తు ఉంది’ అంటూ నోటికొచ్చినట్టు పేలుతాడు షణ్ముఖ్.

అయితే షణ్ముఖ్ అన్ని మాటలు అంటున్నా.. ఒక్కమాట కూడా తిరిగి చెప్పలేకపోయింది సరి.. చివరికి తన తల్లిని తప్పుపడుతున్నా మాట్లాడలేకపోయింది సిరి.. ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత కెమెరా దగ్గరకు వెళ్లి మహానటి పెర్ఫామెన్స్ ఇచ్చింది సిరి. ‘నేను అడిగానా వెయిట్ ఇవ్వమని.. నేను అడిగానా నెత్తిపై పెట్టుకోమని.. నాకు నిజంగానే బుర్రలేదు.. అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ తరువాత షణ్ముఖ్.. సిగ్గులేకుండా మళ్లీ సిరి దగ్గరకు వెళ్లి రా గేమ్ ఆడదాం అని అడుగుతాడు.. అరిచింది నేనే కదా.. అందుకే వచ్చి అడుగుతున్నా.. ఇప్పుడు కూడా నీ ఎమోషన్స్ గురించే మాట్లాడుతున్నావ్.. నిన్ను అసలు ఏం అన్నాను’ అంటూ కవర్ చేసుకుంటాడు.. దోసెలు వేసుకొచ్చి.. సిరికి క్షమాపణ చెప్తాడు.. దీంతో సిరి నవ్వుతూ.. షణ్ముఖ్‌కి హగ్ ఇస్తుంది. మా మమ్మీ ఏమీ అనదు అనడంతో సిరిని సోఫాలో పెట్టుకుని ఎప్పటిలాగే తెగ నలిపేస్తాడు షణ్ముఖ్. దీంతో కథ సుఖాంతం.. హగ్‌ల డర్టీ పిక్చర్ మళ్లీ మొదలు. హగ్‌లు చేసుకుంటే చేసుకోండి దరిద్రుల్లారా.. మాటి మాటికి ఆ పెద్దావిడ పేరు ఎందుకు చెప్తారు.. ఫ్రెండ్ షిప్ హగ్ అని స్నేహబంధాన్ని భ్రష్టుపట్టిస్తూ.. దానికున్న పరువుని తీసేస్తున్నాయి ఈ జంట పాములు.

Bigg Boss 5 Episode 95: షణ్ముఖ్ టైటిల్‌ని గంగలో కలిపేసిన ఎపిసోడ్.. నీఛమైన క్యారెక్టర్‌తో పాతాళానికి.. పాపం సిరి

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad