Trending

6/trending/recent

Best Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇక్కడ తెలుసుకోండి..!

 Best Home Loan Interest Rates: మీరు సొంతంగా ఇల్లు కొనాలని భావిస్తున్నారా? ఇందుకోసం హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఏ బ్యాంకు ఎంత వడ్డీకి హోమ్ లోన్ ఇస్తుందో తెలియదా? అయితే, హోమ్ లోన్స్‌కి సంబంధించి.. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి రుణాలు ఇస్తుందో ఇక్కడ తెలుసుకోండి. సాధారణంగానే.. హోమ్ లోన్ మీ స్వంత ఇంటిని కలను నెరవేర్చుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే, హోమ్ లోన్ అనేది వ్యక్తి తీసుకునే అతిపెద్ద రుణంగా పేర్కొంటారు. లోన్ మొత్తం 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. ఈ కాలంలో మీరు చెల్లించే మొత్తం.. మీరు తీసుకున్న మొత్తానికి రెండింతలు అయ్యే ఛాన్స్‌ ఉంది. దీనికి కారణం వడ్డీ రేటు అని చెప్పాలి. అందుకే.. రుణ భారం ఎక్కువగా పడకుండా, ఏ బ్యాంకులైతే తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ ఇస్తాయో వాటికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తే రుణ భారం తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ లోన్ మొత్తం రూ. 30 లక్షలు, దానికి 20 సంవత్సరాల వాల వ్యవధి అనుకుంటే.. ఎంత కట్టాల్సి ఉంటుంది? ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తోంది వంటి వివరాలు క్లియర్‌గా చూద్దాం.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

వడ్డీ రేటు: 6.40 నుంచి 7.40 శాతం

EMI: రూ. 22,191 నుంచి రూ. 23,985

ప్రాసెసింగ్ ఫీజ్: లోన్ మొత్తంలో 0.50 శాతం (గరిష్టంగా రూ. 15,000) అదనంగా GST

ఇండియన్ బ్యాంక్..

వడ్డీ రేటు: 6.50 నుండి 7.50 శాతం

EMI: రూ. 22,367 నుండి రూ. 24,168

ప్రాసెసింగ్ ఫీజ్: లోన్ మొత్తంలో 0.20 నుండి 0.40 శాతం (గరిష్టంగా రూ. 50,000)

బ్యాంక్ ఆఫ్ బరోడా..

వడ్డీ రేటు: 6.50 నుండి 8.10 శాతం

EMI: రూ. 22,367 నుండి రూ. 25,280

ప్రాసెసింగ్ ఫీజ్: లోన్ మొత్తంలో 0.50 శాతం వరకు (కనీస రూ. 8,500, గరిష్టంగా రూ. 25,000) అదనంగా GST

బ్యాంక్ ఆఫ్ ఇండియా..

వడ్డీ రేటు: 6.50 నుండి 8.85 శాతం

EMI: రూ. 22,367 నుండి రూ. 26,703

ప్రాసెసింగ్ ఫీజ్: 31 డిసెంబర్ 2021 వరకు ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.

కోటక్ మహీంద్రా బ్యాంక్..

వడ్డీ రేటు: 6.55 నుండి 7.20 శాతం

EMI: రూ. 22,456 నుండి రూ. 23,620

ప్రాసెసింగ్ రుసుము: లోన్ మొత్తంలో 2% ప్రాసెసింగ్ ఫీజ్, GST.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్..

వడ్డీ రేటు: 6.60 నుండి 7.60 శాతం

EMI: రూ. 22,544 నుండి రూ. 24,352

ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.25 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజ్.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

వడ్డీ రేటు: 6.70 నుండి 6.90 శాతం

EMI: రూ. 22,722 నుండి రూ. 23,079

ప్రాసెసింగ్ ఫీజు: పూర్తి తగ్గింపు

Best Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇక్కడ తెలుసుకోండి..!

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad