Trending

6/trending/recent

Amazon: ఐదు గంటలపాటు నిలిచిపోయిన అమెజాన్ వెబ్ సర్వీసులు.. ఎక్కడంటే..

మంగళవారం క్లౌడ్ సర్వీస్​ నెట్​వర్క్ అమెజాన్​ వెబ్​ సర్వీస్ సేవలకు ఐదు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. Amazon వెబ్ సర్వీసెస్ (AWS), ప్రైమ్ వీడియో,ఇ-కామర్స్ వెబ్‌సైట్‌తో సహా Amazon.com Inc సేవలు నిలిచిపోయాయని అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com తెలిపింది...

మంగళవారం క్లౌడ్ సర్వీస్​ నెట్​వర్క్ అమెజాన్​ వెబ్​ సర్వీస్ సేవలకు ఐదు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. Amazon వెబ్ సర్వీసెస్ (AWS), ప్రైమ్ వీడియో,ఇ-కామర్స్ వెబ్‌సైట్‌తో సహా Amazon.com Inc సేవలు నిలిచిపోయాయని అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com తెలిపింది. లక్షలాది మంది అమెజాన్ వెబ్ సర్వీస్ సేవలనే వినియోగిస్తున్నారు. అమెరికాలోని అనేక ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, కంపెనీలు సహా హాట్​ స్టార్, నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్​, టిండర్​, ఐఎండీబీ ఈ సేవలనే ఉపయోగిస్తున్నాయి. యూజర్లు కొన్ని గంటలపాటు యాప్స్‎​ను యాక్సెస్ చేయలేకపోయారు. గంటల వ్యవధిలోనే 14వేల ఫిర్యాదులు అందాయి.

“మేము US-EAST-1 ప్రాంతంలో API, కన్సోల్ సమస్యలను ఎదుర్కొంటున్నాం” అని అమెజాన్ తన సర్వీస్ హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లోని ఒక నివేదికలో పేర్కొంది. మంగళవారం సాయంత్రానికి సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రకటనలో తెలిపింది. అమెరికాలో మాత్రమే ఈ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల తూర్పు అమెరికా ప్రధానంగా ప్రభావితమైనట్లు సంస్థ పేర్కొంది. అమెజాన్ వేర్​హౌస్​, డెలివరీ ఆపరేషన్స్​ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సేవలకు అంతరాయం ఏర్పడగా.. ఐదు గంటల తర్వాత వాటిని పునరుద్ధరించారు

Amazon: ఐదు గంటలపాటు నిలిచిపోయిన అమెజాన్ వెబ్ సర్వీసులు.. ఎక్కడంటే..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad