Trending

6/trending/recent

Aarogya Sri Review: ఆరోగ్యశాఖ సమీక్ష లో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్..

Aarogya Sri Review:   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ సమీక్ష లో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ తో బాధపడే రోగులకు చికిత్స అందించేందుకు రాష్ట్రంలో మరికొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయం చేశారు. ఇప్పటివరకు క్యాన్సర్ తో బాధపడుతున్నవారు అధునాతన వైద్యం కొరకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఇలాంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన వైద్యాన్ని ప్రజలకు వారికి దగ్గర్లోనే అందించాలని మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనున్న మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనున్నారు. వీటితో పాటుగా మరొక 3 ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించి క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్యం అందించనున్నారు.

ఆరోగ్యశ్రీ అమలుకు ప్రత్యేక యాప్

పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ అమలులో నిర్దిష్ట వేగాన్ని, కచ్చితత్వాన్ని ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను ఉపయోగించేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ యాప్ ప్రజల సందేహాలను తీర్చడానికి తగిన విధంగా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ యాప్ ని ఆసుపత్రిలో ఉండే ఆరోగ్య మిత్రలకు అందజేయనున్నారు.
Aarogya Sri Review:  ఆరోగ్యశాఖ సమీక్ష లో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad