Trending

6/trending/recent

Viral News: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బానిస గది.. అందులో ఏముందో తెలిస్తే షాకే.!

 పూర్వకాలంలో రాజులు తమ బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించేవారని చర్రితలో చదువుకున్నాం. ఆధునిక కాలంలో ఈ బానిస వ్యవస్థ దాదాపు ముగిసినట్లే. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అంతేకాదు వారి జీవన విధానం భయం కలిగిస్తుంది కూడా. అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పూరాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం చెందడంతో వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయింది.

సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్‌, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గదిలోని మంచాలు 1.7 మీటర్ల పోడవు, 1.4 మీట్లర్ల వెడల్పుతో ఉ‍న్నాయి. వాటితోపాటు కుండలు, కొన్ని ఇతర వస్తువులు కూడా లభించాయి. వాటిని చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బానిసలను ఈ గదిలో బంధించి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఈ గది గోడకు ఓ చిన్న కిటికి ఉండి.. గోడలకు ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్నాయని తెలిపారు. ఈ ‘బానిస గది’ పై స్పందించిన పాంపీ డైరెక్టర్ జనరల్ గాబ్రియేల్ జుచ్ట్రిగెల్‌ .. చారిత్రక మూలాల్లో అరుదుగా కనిపించే వ్యక్తులకు సంబంధించిన వాస్తవికత బయట పడిందని, పురాతనమైన కాలానికి చెందినవారు ఎలా జీవించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తన జీవితంలో ఇది ఓ గొప్ప తవ్వకమని పేర్కొన్నారు.




Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad