Trending

6/trending/recent

PRC పై త్వరలో నిర్ణయం

  • సీఎస్ గారితో మరో విడత జేఏసీ నేతల భేటీ
  • 8 న సీఎం గారికి నివేదిక ..
  • ఆర్థికేతర అంశాలపై ప్రభుత్వ పరిశీలన...
  •  ఆర్థిక డిమాండ్లపైపే నిర్ణయాన్ని ప్రకటించాలని ఉద్యోగులు.

ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సిఫార్సులపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 2018 జూలై నుంచి పీఆర్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి అమలు చేస్తున్న నేపథ్యంలో పీఆర్సీలో పెద్దగా వ్యత్యాసం కనిపించకపోయినా హౌస్లెంట్ అలవెన్స్ (హెచ్ఎర్ఎ), ఇతర రాయితీలపై ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పీఆర్సీ నివేదికను గత సీఎస్ ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే గత కొద్దిరోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీల ఆందోళన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి గారికి వివరించేందుకు ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి గారికి వివరించను న్నారు. అదే రోజు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజే సేందుకు కసరత్తు జరుపు తున్నారు. గత నెల 29వ నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావే శంలోనే ఈ మేరకు సీఎస్ గారు హామీ ఇచ్చారు.

గత నెలాఖరు కల్లా పీఆర్ సీని బహిర్గతం చేస్తామని వెల్లడించారు. అయితే సాధారణ సెలవులు, ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడింది. ముఖ్యమంత్రి గారితో సీఎస్ గారి భేటీ అనంతరం పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2014-18కి 43 శాతం ఫిట్ మెంట్ను అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే అమలు చేస్తున్నందున పీఆర్సీ కార ణంగా అదనపు భారంపడే అవకాశం లేదని చెప్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సన్నగిల్లింది. పరిధికి మించి రుణసేకర ణ జరిపే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికేతర అంశాలు తప్ప మిగిలిన వాటిపై ఎలాంటి నిర్ణ యం తీసుకోరాదని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వాని కి సూచిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి గారు మాత్రం ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ముందుగా పరిష్కరించే దిశగా ఆలోచనలు జరుపుతున్నా రు.

గత 8 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్బీ, జీపీఎఫ్, మెడికల్ రీ యింబర్స్ మెంట్ తో పాటు పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఇతర ప్రోత్సాహకాలు చెల్లింపులు జరగలేదు. దీంతో పాటు ప్రభుత్వం గత ఏడాది విడతల వారీగా డీఏ బకాయిలను తీరుస్తామని ప్రకటించింది. ఉద్యోగుల కోర్కె లు న్యాయపరమైనవే అయినప్పటికీ ఇవన్నీ నెరవేరాలంటే తలకు మించిన భారమవుతుందని ఆర్థికశాఖ అంచనాలు వేస్తోంది. అయితే ఒకే విడత అన్నిరకాల చెల్లింపులు జరపా లని తాము డిమాండ్ చేయటంలేదని ముందుగా ఓ నిర్ణయం తీసుకుని ఆపై షెడ్యూల్ ప్రకటిస్తే ఉద్యోగులకు వెసులుబాటు కలుగుతుందని జేఏసీల నేతలు వాదిస్తున్నా ఉద్యోగ సంఘాల డిమాండ్లలో భాగంగా కోవిడ్ కార మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారు ణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అయితే ఇందులో విధి నిర్వహణలో సహజ మరణం పొందిన వారి కుటుంబాలకు కూడా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుపడుతున్నాయి.

 ఇక జేఏసీల ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు, పెండింగ్లో ఉన్న బకాయి లు, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం తదితర అంశాలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రధానంగా వేతన సవరణకే పట్టుపడుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీజేఏసీ, జేఏసీ- అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్ప రాజు వెంకటేశ్వర్లు తదితర నేతలు శుక్రవారం సచివాల యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గారితో మరోసారి భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదికను అందించా లని విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి గారి పరిశీలన పూర్తయిన తరువాత ఈనెల 8వ తేదీన పీఆర్సీ నకలు కాపీ లను ఉద్యోగ సంఘాలకు పంపుతామని సీఎస్ గారు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిట్మెంట్ కు, ఐఆర్కు ఉన్న వ్యత్యాసాన్ని బేరీజు వేసుకున్న తరువాత తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు జేఏసీల నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెచ్ఐర్ఎ, స్థానికులకు 20 శాతం అమలు చేస్తోంది. తెలంగాణలో హెచ్ఎర్ఎ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీ ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad