Trending

6/trending/recent

JIO Phone Next: అత్యంత చ‌వ‌కైన జియో స్మార్ట్ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా.? అయితే ఇది మీకోస‌మే..

 JIO Phone Next: రిల‌య‌న్స్ సంస్థ అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్‌గా అభివ‌ర్ణించిన జియోఫోన్ నెక్ట్స్ ఎట్ట‌కేల‌కు మార్కెట్లోకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. 

నిజానికి ఈ ఫోన్ గ‌త వినాయ‌క చవితికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా చిప్ కొర‌త కార‌ణంగా త‌యారీ అనుకున్న స్థాయిలో జ‌ర‌గ‌లేదు. దీంతో సంస్థ వీటి విడుద‌ల‌ను దీపావ‌ళికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీపావ‌ళి కానుక‌గా ఈరోజు (గురువారం) ఈ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న కంపెనీ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇక ఈ ఫోన్‌ను రూ. 6,499కే అందుబాటులోకి తీసుకురానున్నారు. అందులోనూ తొలుత కేవ‌లం రూ. 2500ని ముందుగా చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని సంస్థ తెలిపింది. మిగ‌తా మొత్తాన్ని 18/24 నెల‌ల్లో ఈఎమ్ఐ రూపంలో చెల్లించే వెసులుబాటును సంస్థ క‌లిపించింది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇంకా చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌రి జియో ఫోన్ నెక్ట్స్ మీ ప్రాంతంలో ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. వ‌చ్చిన వెంట‌నే మీకు అల‌ర్ట్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా జియో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంత‌రం స్క్రీన్‌పై క‌నిపించే జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్‌పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత ఫోన్ ఫోటో ప‌క్క‌న ఉండే “I am Interested” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి జెనెరేట్ ఓటీపీ బ‌ట‌న్‌ను ఎంట‌ర్ చేయాలి.

* మొబైల్‌కి వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయ‌గానే వెంట‌నే మ‌రో పేజ్ ఓపెన్ అవుతుంది.

* ఈ కొత్త పేజీలో మీరు ఉంటోన్న ఇంటి వివ‌రాలు, ప్రాంతం, పిన్‌కోడ్ ఎంట‌ర్ చేయాలి.

* దీంతో మీ ప్రాంతంలో జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము అని మెసేజ్ కనిపిస్తుంది.

* ఇలా మీరు ఉంటున్న చోట ఫోన్‌లు అందుబాటులోకి రాగానే మీకు అల‌ర్ట్ వ‌స్తుంది. అప్పుడు స్థానికంగా ఉన్న జియో స్టోర్‌లోకి వెళ్లి క‌నీస మొత్తాన్ని చెల్లించి ఫోన్‌ను బుక్ చేసుకుంటే స‌రిపోతుంది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad