Trending

6/trending/recent

EV Charging: ఇండియన్‌ ఆయిల్‌ కీలక నిర్ణయం.. దేశంలో 2 వేల ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లు..

 EV Charging: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ కారణంగా వాహన రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పలు వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందుకు తగినట్లుగా ఛార్జింగ్‌ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతోంది. రాబోయే 12 నెలల్లో 2000 ఛార్జింగ్‌ స్టేషన్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ సందర్భంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం వైద్య మాట్లాడుతూ.. రానున్న 12 నెలల్లో దేశ వ్యాప్తంగా 2 వేల వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లను నిర్మిస్తామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మరో 8 వేల ఛార్జింగ్‌ స్టేషన్‌లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 10 వేల ఛార్జింగ్‌ స్టేషణ్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

దేశంలో 5 వేల ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) ప్రకటించింది. 5 వేల పెట్రోల్‌ పంపుల వద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ముఖేష్‌ కుమార్‌ సురానా తెలిపారు. ఇప్పటికే కొన్ని పెట్రోల్‌ పంపుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని, కంపెనీ పెట్రోల్‌ పంపుల్లో మునుపటిలాగానే పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో వాహనదారులు తమ ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా పెట్రోల్‌ పుంపుల్లోనే ఛార్జ్‌ చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు మరిన్ని స్టేషన్‌లలో సీఎన్‌జీని కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం 800 పెట్రోల్ బంకుల్లో సీఎన్‌జీ అందుబాటులో ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మహీంద్రా ఆటో, టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీపై కసరత్తు చేస్తున్నాయి. రెండు కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో వేగంగా విస్తరిస్తున్నాయి.

ఈ-బైక్‌లలో గట్టి పోటీ

ఎలక్ట్రిక్‌ బైక్‌, స్కూటర్లు వాహన రంగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ-బైక్‌ల విభాగంలో చాలా కంపెనీలు మార్కెట్లో ప్రవేశించాయి. అందులో టీవీఎస్‌, బజాజ్‌, హీరో పేర్లు ఉన్నాయి.ఈ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లో విడుదల చేశాయి. అలాగే ఓలా కూడా ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అంతేకాదు తక్కువ ధరల్లో విక్రయిస్తుండటంతో అందరి చూపు ఓలాపై పడుతోంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, ఈ-బైక్‌లు వంటి చిన్న ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలో మంచి స్పందన వస్తోంది. త్వరలో గ్రీన్-హైడ్రోజన్‌తో నడిచే ఇంటర్‌సిటీ బస్సులను కూడా రానున్నాయని అన్నారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad