Trending

6/trending/recent

Apps Burden in AP: పాఠాలు తర్వాత .. యాప్ లు ముందు ...

  • బోధనేతర విధులపై గురువుల గుర్రు
  • కృత్రిమ మేధతో యాప్‌ల అనుసంధానంతో అవస్థలు

సర్కారు పాఠశాలల్లో బోధన కంటే బోధనేతర పనులపైనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. టీచర్లు, విద్యార్థుల హాజరు నుంచి మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ వరకు అన్నింటినీ యాప్‌ల్లో నమోదు చేయడానికి తంటాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించక, సకాలంలో వివరాలు నమోదు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బోధనేతర సిబ్బంది లేనిచోట, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనకు పూర్తిగా ఆటంకం ఏర్పడుతోందని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం  చేస్తున్నాయి. పుస్తకాలు పట్టుకుని పాఠాలు చెప్పడం కంటే సెల్‌ఫోన్లు పట్టుకుని ఫొటోలు తీయడానికే సమయమంతా సరిపోతుందని వాపోతున్నారు.

తొలిగంట నుంచే..

ఉదయం పాఠశాలకు రాగానే ఉపాధ్యాయులు ఐరిస్‌ ఆధారంగా హాజరు నమోదు చేసుకోవాలి. తొలి పిరియడ్‌లోపు విద్యార్థుల హాజరు కూడా యాప్‌లోనే నిక్షిప్తం చేయాలి. ఒక్కో పాఠశాలలో విద్యార్థులు వందల సంఖ్యలో ఉండడంతో వారి హాజరంతా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి చాలా సమయమే తీసుకుంటుంది. ఆ సమయంలో బోధన కూడా సక్రమంగా జరగడం లేదు.

తరువాత టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) యాప్‌లో ఆయాల హాజరు నమోదు చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఎన్ని బేసిన్లు ఉంటే అన్నింటికీ ఫొటోలు తీయాలి.

ఐఎంఎంఎస్‌ యాప్‌లో మధ్యాహ్న భోజన వివరాలు నమోదు చేయాలి. వంట గది ప్రదేశం, సరకులు నిల్వచోటు, వండే పాత్రలు, చెత్త డబ్బా, విద్యార్థులు తినే ప్రదేశం, మంచినీటి సదుపాయం, చేతుల శుభ్రత, గుడ్లుకు ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఏ ఒక్కటి చేయకున్నా సంబంధిత   ప్రధానోపాధ్యాయుడిదే బాధ్యత.

జగనన్న విద్యాకానుక సమాచారం, పంపిణీ చేసిన కిట్లకు విద్యార్థుల తల్లులతో బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ తీసుకోవాలి.

ఫొటోలు బాగోలేవంటే..

అక్కడ మరిన్ని ఇబ్బందులు..

నలుగురైదుగురు ఉపాధ్యాయులున్నచోట యాప్‌ల నమోదు బాధ్యతను ఒక్కొక్కరూ పంచుకోవడానికి వీలుంటుంది. అదే ఏకోపాధ్యాయ పాఠశాలలకు వచ్చేసరికి ఇటు బోధన, యాప్‌ల యాతన ఉన్న ఒక్కరిపైనే పడుతుంది. ఒక్కోసారి ఆయన సెలవు పెట్టినప్పుడు వేరొకరిని సర్దుబాటు చేస్తుంటారు. అలాంటప్పుడు కొత్త ఉపాధ్యాయునికి ఇక్కడి వివరాలను ఆన్‌లైన్‌ చేయడం కష్టతరం అవుతోందని గురువులు చెబుతున్నారు. ఇటు బోధనపై దృష్టిపెట్టాలా.. అటు ఆన్‌లైన్‌లో సమాచారం పొందుపరచడమే పనిగా ఉండాలా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు.

ప్రమాణాలపై ప్రభావం..

‘బోధన ఒక్కటే కాదు.. పాఠశాల సమాచారమంతా రోజూ ఆన్‌లైన్‌ చేయాలని వివిధ రకాల యాప్‌లను ఇచ్చారు. వాటితో చాలా సమయం గడిచిపోతోంది. దీంతో ఉపాధ్యాయులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి’ అని ఎస్టీయూ, యూటీఎఫ్‌ సంఘాల నేతలు ఇమంది పైడిరాజు, గొంది చిన్నబ్బాయ్‌ కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో చంద్రకళ వద్ద ప్రస్తావించగా విద్యా శాఖ సూచించిన పనులన్నీ విధుల్లో భాగంగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు.Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad