Trending

6/trending/recent

Aided Schools: ‘ఎయిడెడ్'ను నిర్వీర్యం చేయొద్దు

  • ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు 
  • అమలాపురంలో విద్యార్థుల ర్యాలీ, ధర్నా 

న్యూస్ టోన్ - తూర్పుగోదావరి, గుంటూరు: ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేయొద్దని, జిఒ 35, 42, 50లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విద్యార్థులు ర్యాలీ, ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లాలో రౌండేబుల్ సమావేశం నిర్వహించారు. అమలాపురంలో ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో ఎస్కెబిఆర్ కళాశాల విద్యార్థులు మెయిన్రోడ్డుపై ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కళాశాల ఎదుట చేపట్టిన ధర్నానుద్దేశించి ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులపై ఫీజుల భారం పడుతుందని తెలిపారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం పునరాలోచించి ఎయిడెడ్ కళాశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఎస్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి రాజా మాట్లాడారు. కాకినాడలో ఎంఎస్ఎన్ ఛారిటీస్ విద్యాసంస్థల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిఐటియు, ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యనందించడానికి ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసి ఎయిడెడ్ విద్యాసంస్థలను నెలకొల్పారని తెలిపారు. డ్రాపౌట్లు తగ్గించడానికి పథకాలు అమలు చేస్తున్నామంటున్న వైసిపి మరోవైపు తన విధానాలతో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేలా వ్యవహరిస్తోందని, ప్రత్యామ్నాయం చూపకుండానే విలీన ప్రక్రియ చేపట్టిందని విమర్శించారు. ఎయిడెడ్ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు ఖాళీగా ఉన్న రెండు వేల లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో 72 శాతం మంది ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య పొందుతున్నారని, మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ కార్పొరేట్, ప్రైవేటు విద్య ఆధిపత్యం వహిస్తోందని తెలిపారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad