Trending

6/trending/recent

One Time Settlement - Question & Answers: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రశ్నలు సమాధానాలు

 Qn : లబ్దిదారు పట్టాలో ఇచ్చిన భూమి కంటే ఎక్కువ భూమిని ఆక్రమించినట్లయితే ఆ లబ్దిదారునికి ఆక్రమించిన మొత్తం భూమికి హక్కు కల్పించబడుతుందా? లేదా పట్టాలో ఇచ్చినంత వరకు మాత్రమే హక్కు కల్పించబడుతుందా?

Ans : GO ఆధారంగా పట్టా (లేదా) స్వాధీన ధృవీకరణ పత్రంలో ఇవ్వబడిన భూమి మేరకు మాత్రమే హక్కులు కల్పించబడుతాయి. లోన్ ఉన్న వారి (Loanee cases) పత్రాలు మాత్రమే APSHCL కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.లోన్ లేని లబ్ధిదారుల నుండి పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది.

Qn : గ్రామ పంచాయతీలో లేని లబ్ధిదారుడుని సంబంధిత PS కి తప్పుగా ట్యాగ్ చేశారు?

Ans : రికార్డును తిరిగి AE లాగిన్‌కు పంపడానికి PS లాగిన్లో ఆప్షన్ ఇవ్వడం జరిగినది.

Qn : డూప్లికేట్ లబ్దిదారు/ నకిలీ ఆధార్/ మరణం లాంటి సందర్భాలలో..?

Ans : కారణాన్ని తెలియజేస్తూ రికార్డును తిరిగి AE లాగిను పంపడానికి PS లాగిన్లో ఆప్షన్ఇ వ్వబడింది.

Qn : పంచాయతీ కార్యదర్శి ఎవరైనా లబ్ధిదారున్ని తప్పుగా డిజిటల్అ సిస్టెంట్'కు కేటాయించారు?

Ans : రికార్డును తిరిగి PS కి పంపడానికి DA కి అవకాశం కల్పించబడింది. PS దానిని వేరే సచివాలయానికి లేదా AE కి పంపవచ్చు.

Qn : DA లాగిన్లో క్లస్టర్ తప్పుగా మ్యాప్ చేయబడింది.

Ans : PS కు రికార్డును తిరిగి పంపడానికి DA కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

Qn : భార్య మరియు భర్తకు రెండు వేర్వేరు ఐడీలతో రెండు ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. ఒక ఇల్లు మాత్రమే నిర్మించి అందులో నివాసం ఉంటున్నారు. ఇంకో ఇల్లు నిర్మించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి?

Ans : నిర్మించిన ఇంటి వివరాలు తీసుకోవలెను.నిర్మించబడని ఇంటి వివరాలు వాలంటీర్ యొక్క ఎంట్రీ ఫాం లో పార్ట్-D లో 'గృహము ఉన్నదా: అనే ఆప్షన్ దగ్గర “లేదు" అని ఎంటర్ చేయవలెను.

Qn: ఎల్టీఆర్ చట్టం వాడుకలో ఉన్న ఐటీడీఏ ప్రాంతాల్లో భూమి బదిలీకి అనుమతి లేదు. కానీ ఆ ప్రాంతంలో ఒకవేళ భూమి గిరిజనేతరుడికి బదిలీ చేయబడితే?

Ans : ప్రతిపాదిత OTS ఏ విధంగానూ ITDA ప్రాంతాల్లో ఉన్నచట్టాలు/నిబంధనలను అధిగమించదు. చట్టానికి వ్యతిరేకంగా బదిలీ జరిగిన సందర్భాలలో, తప్పును నమోదు చేయడానికి DAIVRO లాగిలో ప్రొవిజన్ అందించడం జరిగినది.

Qn : లబ్ధిదారులు ఫారాలపై సంతకం చేయని సందర్భాలలో..?

Ans : లబ్ధిదారులు అంగీకరించలేదు అని నమోదు చేయవచ్చు. లబ్ధిదారుల నుండి అటువంటి ప్రతిస్పందనను నమోదు చేయడానికి DA లాగిన్లో ఆప్షన్ ఉంది. లబ్ధిదారుని అంగీకారం మార్చడానికి కూడా సదుపాయం ఉంది.

Qn : లబ్ధిదారుడి యొక్క రుణ దరఖాస్తు ఫారంలో (పార్ట్ సి) పేర్కొన్న వివరాలు.. క్షేత్రస్థాయి సర్వేలో పేర్కొన్న వివరాలకు భిన్నంగా ఉన్నట్లైతే డేటా ఎంట్రీ చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రొవిజన్ అందించాలి.

Ans : అలాంటి డాక్యుమెంట్స్ ని మార్చడానికి ప్రొవిజన్ ఆప్షన్ ఉంది. అయితే, ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి VRO ఏదైనా చర్యను ప్రతిపాదించే ముందు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఏ డాక్యుమెంట్ తనఖాగా ఉంచబడిందో AE హౌసింగ్ ద్వారా తనిఖీ చేయవచ్చు.

Qn : రెవెన్యూ డిపార్ట్ మెంట్'లో సర్వే వివరాలను మార్చటానికి చాలా సమయం పడుతుంది.

Ans : లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పై ముద్రించబడేది ప్రస్తుత వివరాలు కనుక పాత సర్వే నంబర్లు కాకుండా ప్రస్తుత నంబర్లు సేకరించాల్సి ఉంటుంది.

Qn : పొజిషన్ సర్టిఫికెట్ భర్త పేరు మీద తీసుకొని, భార్య పేరు మీద ఇళ్ళు మంజూరు అయితే ఏమి చేయాలి?

Ans : రుణం తీసుకోని లబ్ధిదారుల విషయంలో బహుశా ఈ సమస్య తలెత్తవచ్చు.రుణం తీసుకున్న లబ్ధిదారుల విషయంలో, అందుబాటులో ఉన్న పట్టాల డేటా నమోదు చేయబడింది కావున లోపం వచ్చే అవకాశం తక్కువ. లోన్ తీసుకోని వారి విషయంలో డేటా ఎంట్రీకి ఒక ఆప్షన్ ఉంది. అటువంటి వాటిని ఆ ఆప్షన్'లో నమోదు చేయవచ్చు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad