Trending

6/trending/recent

Demand For PRC Report: పీఆర్సీ పూర్తి స్థాయి నివేదిక బయట పెట్టాల్సిందే

  •  పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల  నేతలు

న్యూస్ టోన్, అక్టోబరు 29:  జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసే లోపే  పీఆర్సీ పూర్తిస్థాయి నివేదికను బయటపెట్టాలని  ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు.  పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన  జరిగింది. 

పీఆర్సీ నివేదిక బయట పెడితేనే ఈ సమావేశంలో మాట్లాడతామని, లేదంటే వెళ్లిపోతామని  ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు కుండబద్దలు కొట్టడంతో  సమీర్ శర్మ  స్పందిస్తూ ఈ సమావేశం అయిన వెంటనే పీఆర్సీ నివేదిక పాక్షికంగా వెల్లడిస్తామని హామీ ఇచ్చారు.  పూర్తి స్థాయి నివేదికను మూడు రోజుల్లో  వెల్లడిస్తామన్నారు.  ఆయన చెప్పినట్లే క్లుప్తంగా ఒక పేజీ  మాత్రమే విడుదల చేశారు. సమావేశం ముగిసే లోపు నివేదిక పూర్తిస్థాయిలో వెల్లడించాల్సినదేనని ఏపీ జెఏసి అమరావతి చైర్మన్  బొప్పరాజు తదితర నేతలు పట్టుబట్టారు. 

 పీఆర్సీ నివేదిక  శుక్రవారం సాయంత్రం లోపు విడుదల చేయకుంటే ఆందోళనలు చేపడతామని  యూటీఎప్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్  స్పష్టం చేశారు.  కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఈ సమావేశంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పట్టుబట్టారు.  టైపిస్ట్  పోస్టులను జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ గా  మార్చాలని డిమాండ్ చేశారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad