Trending

6/trending/recent

Yoga Competitions: విద్యార్థులకు వర్చువల్‌ యోగాననముల పోటీలు

Yoga Competitions:  ఆయుష్‌ శాఖ - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021 జూన్‌ 21న జరగబోవు అంతర్జాతీయ యోగా దినోత్సవం నందర్భంగా విద్యార్థులకు వర్చువల్‌ యోగాననముల పోటీలు నిర్వహించబడుతున్నాయి.

ఈ పోటీలు రెండు దశలలో ఉంటాయి. మొదటి దశలో విద్యార్థులు ఈ క్రింది నిబంధనల మేరకు ఆసనములు చేన్లూ వీడియోలు నమర్చించవలసి ఉంటుంది. వీరిలో నుండి ఎంపిక కాబడిన వారికి రెండవ దశలో పోటీలు ఉంటాయి.

మొదటి దశనియమ నిబంధనలు :

1) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం.

2) 01.06.2021 నాటికి 18 సం॥లు నిండి ఉండరాదు.

3) మొదటి దళ పార్ట్‌-ఏ లో నాలుగు ఆననములు, పార్ట్‌-బి లో నాలుగు ఆననములు ఉంటాయి. పార్ట్‌-ఏ నుండి ఏవైన రెండు ఆననాలు, పార్ట్‌-బి నుండి ఏవైన రెండు ఆననాలు తప్పనినరిగా విద్యార్థి చేయవలసి ఉంటుంది.

పార్ట్‌-ఏ

(1) గరుడ ఆననము

(2) పశ్చిమోత్తాసనము 

(3) హలాసనం 

(4) శీర్షాసనం

పార్ట్‌-బి

(1) వూర్ణ నటరాజ అసనం

(2) బకాసనం

(3) పూర్ణ సుప్త వజ్రాసనం 

(4) ధనుర్‌ ఆసనం

విద్యార్థులు ఆయా ఆసనములను చేయుచున్నవ్వుడు వీడియో రికార్డు చేయవలసి ఉంటుంది. రికార్డింగ్‌ చేయునవ్వుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎ) సెల్‌ఫోన్‌ ద్వారా గానీ, వీడియో కెమరా ద్వారా గానీ వీడియో తీయవచ్చును.

బి) బ్యాక్‌గ్రౌండ్‌ సాధ్యమైనంత వరకు తెలుపుగా ఉంటే మంచిది.

సి) ఆసనము చేస్తున్నప్పుడు ఒకే యాంగిల్‌ కాకుండా వివిధ యాంగిల్స్‌లో తీయాలి.

డి) బ్యాక్‌గ్రౌండు మ్యూజిక్‌ ఉండరాదు.

ఈ) వీడియో మొదటిలో విద్యార్థి పేరు, వయన్సు, తరగతి, న్మూలు/కాలేజి పేరు, జిల్లా పేరు మరియు విద్యార్థి కాంటాక్ట్‌ నెంబర్‌ను ప్రదర్శించాలి.

  • 4 ఆసనములను క ని॥ల వ్యవధిలో పూర్తి చేయవలెను.
  • ప్రతి ఆనన స్థితిలో 20 నుండి 30 సెకన్ల మించి ఉండనవనరం లేదు.
  • ఈ విధంగా తీసిన వీడియోలను ది. 16.06.2021వ తేదీ సా॥ 5.00 గంటల లోగా 2021yogacompetition@gmail.com కు వంవవలెను.
  • పోటీదారులు ఏ విధమైన సర్జిఫికెట్స్‌ గానీ, ప్రవేశ రుసుములు గానీ వంపించవలసిన అవనరం లేదు.

రెండవ దశ:

మొదటి దశలో వీడియోల ఆధారంగా ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారి ఎంపిక జరుగుతుంది. వీరికి వర్చువల్‌ వద్ధతిలో న్యాయ నిర్దేతల నమక్షంలో పోటీలు నిర్వహించబడతాయి.

వీరు చేయవలసిన ఆసనములు, తేది, సమయము ఫోన్‌ ద్వారా తరువాత తెలియ జేయబడదతాయి.

అంతిమ విజేతలకు జూన్‌ 21న రాష్ట్ర స్థాయిలో బవముమతులు అందించబడతాయి.

పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad