Trending

6/trending/recent

Yaganti Temple: ఆంధ్రప్రదేశ్ లోని ఈ క్షేత్రానికి కలియుగాంతానికి లింక్ ఉందని భక్తుల నమ్మకం.. కాలజ్ఞానంలో కూడా ప్రస్తావన

 Yaganti Temple: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు.. ఆలయాల నిర్మాణంలో సైన్స్ కు అందని మిస్టరీలు.. అటువంటి ఓ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఉన్న నందికి కలియుగాంతానికి లింక్ ఉన్నదని భక్తుల విశ్వాసం..


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం యాగంటి. ఇక్కడ ఉన్న ఉమామహేశ్వర ఆలయం యుగాంతంతో ముడిపడి ఉన్నది.

అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.

యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. నంది విగ్రహం మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నది. ఈ విగ్రహం మొదట్లో చిన్నగావున్నా .. రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు.

ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని సైంటిస్టులు.. చెబుతున్నారు.

ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని భక్తుల విశ్వాసం. ఈ విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వర్ణించారు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad