Trending

6/trending/recent

Weather Alert: మీ ప్రాంతం లో మరో 40 నిమిషాల్లో వర్షం పడుతుంది, పిడుగులు పడతాయి...ఇలాంటి ముందస్తు SMS పొందండి ఇలా...

Weather Alert: అసలే వర్షా కాలం. మన రోజువారీ పనులు చూసుకోవడానికి బయటికి వెళ్తే, ఏ సమయం లో వర్షం వస్తుందో, ఏ సమయం లో పిడుగులు పడతాయో అనే భయం అందరికీ ఉంటుంది. ఇలాంటి భయాలు లేకుండా వాతావరణ హెచ్చరికలను మన మొబైల్ కే నేరుగా ఎస్.ఎం.ఎస్ పొందవచ్చు. ఈ సందేశాలను ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ పంపుతుంది. ఇలా సందేశాలను పొందడానికి ఈ క్రింది విధంగా చేయాలి.

  • సందేశాలను పొందడం కోసం మీరు బి.ఎస్.ఎన్.ఎల్ సిమ్ ను తీసుకోవాలి.
  • బి.ఎస్.ఎన్.ఎల్ సిమ్ ను తీసుకునే సమయం లో మీ ఆధార్ కార్డు ను ఐడెంటిటీ ప్రూఫ్ గా వాడాలి.
  • ఇలా తీసుకున్న బి.ఎస్.ఎన్.ఎల్ సిమ్ కు వాతావరణ హెచ్చ రికల ఎస్.ఎం.ఎస్ వస్తాయి.
  • మీ ఆధార్ కార్డు లోని చిరునామా మీ ప్రస్తుత చిరునామా అయ్యి ఉండాలి.

ఎస్.ఎం.ఎస్ విధానం ఎలా పని చేస్తుంది ?

మీ మొబైల్ నంబరు తో సహా మీ చిరునామా వివరాలు బి.ఎస్.ఎన్.ఎల్ నుండి ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ కు చేరతాయి. ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ సర్వర్లు మీ చిరునామా ప్రాంతం లో వర్షాలు, పిడుగులు పడతాయని గుర్తించినపుడు 40 నిమిషాల ముందుగా మీకు హెచ్చరిక సందేశం పంపుతుంది. ఇలా పంపే హెచ్చరికలకు 99 శాతం ఖచ్చితత్వం ఉంటుంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad