Trending

6/trending/recent

Vemana Padyam: వేమన పద్యం తూచ్.. గరిటెడైనను చాలు 'గాడిద' పాలు..

Vemana Padyam:  గాడిద పాలు ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చినట్లు అనిపించవచ్చు కానీ వాస్తవానికి, ఇవి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి.

వేమన శతకం గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు అని ఆనాడు శెలవిచ్చారు. కానీ ఈ రోజు గంగి గోవు (ఆవు) పాల కంటే ఖరము (గాడిద) పాలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆవు పాలు లీటర్ రూ.50 నుంచి 100 లు ఉంటే.. అదే గాడిద పాలైతే లీటర్ రూ.2,000 ధర పలుకుతోంది. గాడిద పాలకు మార్కెట్లో ఉన్న భారీ డిమాండే దీనికి కారణం. గాడిద పాలు ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చినట్లు అనిపించవచ్చు కానీ వాస్తవానికి, ఇవి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. ఇది ఇటీవలే మళ్ళీ ప్రాచుర్యం పొందింది, ముఖ్యంగా ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో, కొత్త ఆహారాలు, పానీయాలను ప్రయత్నించాలనుకునే వారు ఆరోగ్య ప్రయోజనాలతో సహజమైన ఆహారాన్ని తినాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు గాడిద పాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటారు.

గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్య సాధనంగా ఉపయోగించే సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. ఈ పాలను ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి మొండి వ్యాధులకు చికిత్సగా ఉపయోగించినట్లు తెలిసింది. క్లియోపాత్రా మృదువైన, కాంతులీనే చర్మం కోసం గాడిద పాల స్నానం చేసేవారట. గాడిద పాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుచేత అంటువ్యాధులకు ఔషధంగా వాడతారు.

వేమన శతకం గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు అని ఆనాడు శెలవిచ్చారు. కానీ ఈ రోజు గంగి గోవు (ఆవు) పాల కంటే ఖరము (గాడిద) పాలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆవు పాలు లీటర్ రూ.50 నుంచి 100 లు ఉంటే.. అదే గాడిద పాలైతే లీటర్ రూ.2,000 ధర పలుకుతోంది. గాడిద పాలకు మార్కెట్లో ఉన్న భారీ డిమాండే దీనికి కారణం. గాడిద పాలు ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చినట్లు అనిపించవచ్చు కానీ వాస్తవానికి, ఇవి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. ఇది ఇటీవలే మళ్ళీ ప్రాచుర్యం పొందింది, ముఖ్యంగా ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో, కొత్త ఆహారాలు, పానీయాలను ప్రయత్నించాలనుకునే వారు ఆరోగ్య ప్రయోజనాలతో సహజమైన ఆహారాన్ని తినాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు గాడిద పాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad