Just In

6/trending/recent

Ads Area

Teachers to Schools: రేపటి నుంచి బడులకు టీచర్లు

హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశం 

 15 నుంచి స్కూల్స్ ప్రారంభానికి సన్నాహాలు

 పాఠశాల విద్యపై మంత్రి సురేష్ సమీక్ష

Teachers to Schools: రాష్ట్రంలో అన్ని ప్ర భుత్వ పాఠశాలలకు జూలై ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయులు హాజరు కావాలని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. కరోనా కర్ఫ్యూ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడం ఆలస్యమైన విషయం.. తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు పాఠశాలల ప్రారంభానికి సంబంధించి సన్నాహక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు జారీ చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్ల వేతనాల పెండింగ్ అంశంపై చర్చించారు. కొన్ని జిల్లాల్లో సీఎఫ్ఎంఎస్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని , మరికొన్ని జిల్లాలకు పేమెంట్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వివరించారు. అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోజమ చేసే రూ. 15 వేలలో టాయిలెట్ మెయింటెనెన్సు కింద రూ. వెయ్యి మినహాయిస్తున్న నేపథ్యంలో ఆ ఫండ్ వినియోగం ఏ విధంగా చేయాలో చర్చించారు . సానిటేషన్ కోసం నియమించు కున్న ఆయాలకు చెల్లించాల్సిన వేతనాలు, సెలవు రోజుల్లో వారి సేవలు ఎలా వినియోగిం చుకోవాలనే అంశాలపై కూడా త్వరగా విధివిధానాలు తయారు చేయాలని మంత్రి సురేష్ అధికారులకు సూచించారు. సమీక్షలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ వాడ్రేవు చిన్నవీరభద్రుడు, సమగ్ర శిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి, మధ్యాహ్నబోజన పథకం డైరెక్టర్ దివాన్ పాల్గొన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information