Trending

6/trending/recent

Postal Schemes: పోస్టాఫీసుల్లో అదిరిపోయే స్కీమ్స్‌ అందుబాటులో.. నెలకు రూ.172 చెల్లిస్తే రూ.3 లక్షలు

 Postal Schemes: పోస్టాఫీసుల్లో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. సాధారణ కస్టమర్ల నుంచి సీనియర్‌ సిటిజన్స్‌ వరకు ఎంతో వివిధ రకాల స్కీమ్‌లో చేరి అధిక లాభాలు గడిస్తున్నారు. కస్టమర్లు అధిక మొత్తంలో లాభాలు వచ్చే విధంగా వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది పోస్టల్‌ శాఖ. ఎన్నో రకాల స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌లు అందిస్తోంది పోస్టల్‌ శాఖ. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్‌ లేకుండానే రాబడి పొందవచ్చు. పోస్టాఫీసులో స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌ మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి గురించి కొందరికి తెలిసినా.. మరి కొందరికి తెలియకపోవచ్చు. పోస్టాఫీస్‌లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా పొందొచ్చు. వీటిల్ల గ్రామ్ సురక్ష స్కీమ్ కూడా ఒకటుంది. ఇది లైఫ్ అస్యూరెన్స్ పాలసీ. 19 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. 55 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారు ఈ పాలసీ పొందటానికి అర్హులు. కనీసం రూ.10 వేల మొత్తానికి బీమా తీసుకోవాలి. అయితే గరిష్టంగా రూ.10 వేల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సౌకర్యం లభిస్తుంది. ఈ పాలసీపై ఇండియా పోస్టల్ రూ.1000కి రూ.60 బోనస్ అందించింది. అంటే రూ.లక్షకు ఏడాదికి రూ.6 వేల బోనస్ వచ్చినట్లు అవుతుంది.

ఉదాహరణకు చెప్పాలంటే 25 ఏళ్ల వయసులో ఉన్నవారు ఈ పాలసీని రూ.లక్ష బీమా మొత్తానికి తీసుకుంటే.. నెలకు రూ.199 చెల్లించాలి. 50 ఏళ్ల టర్మ్‌కు ఇది వర్తిస్తుంది. అదే 55 ఏళ్ల టర్మ్ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.183, 58 ఏళ్లు అయితే రూ.178 పీమియం కట్టాల్సి ఉంటుంది. అదే 60 ఏళ్లకు అయితే రూ.172 పడుతుంది. 50 ఏళ్ల ఆప్షన్‌కు రూ.2.5 లక్షలు, 55 ఏళ్లకు రూ.2.8 లక్షలు, 58 ఏళ్లకు రూ.2.98 లక్షలు, 60 ఏళ్లకు రూ.3.10 లక్షలు వస్తాయి. ఇలా పోస్టల్‌ శాఖలో ఉన్న పలు రకాల స్కీమ్‌లలో చేరిలో మంచి లాభాలు పొందవచ్చు. డబ్బులను పొదుపు చేసుకుని అన్వెస్ట్‌ చేస్తే బాగుంటుంది. మున్ముందు అవసరాలకు ఉపయోగపడతాయి.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad