Trending

6/trending/recent

NEP: ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి జగన్ భరోసా

  • ఒక్క టీచరును కూడా తొలగించబోం
  • కొత్త విద్యా విధానంపై ఆందోళన వద్దు

కొత్త విద్యా విధానం నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయ లోకానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఒక్క ఉపాధ్యాయుడిని కూడా తొలగించబోము అని జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై  సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త విద్యావిధానంపై మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏం చెప్పారో చూడండి...

- ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలి.

- నూతన విద్యావిధానంవల్ల జరిగే మేలును వారికి వివరించాలి

- మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలి.

- ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు – నేడు కింద భూమి కొనుగోలు  చేయాలి.

- వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి

– స్కూళ్లు,అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు-

– ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad