Trending

6/trending/recent

NEP: చిన్నారులకు స్కూల్‌ కష్టాలు

  • 41 ప్రాథమిక పాఠశాలలు మినహా మిగతా వారందరికీ దూరాభారమే
  • 3, 4, 5 తరగతుల పిల్లలకు తిప్పలు
  • జిల్లాలో నూతన విద్యా విధానం ప్రతిపాదనలపై స్కూళ్ల మ్యాపింగ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 10: రాష్ట్రంలో మూడం చెల విద్యా విధానంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టదలచి న నూతన విద్యా విధానం ప్రతిపాదనల కార్యరూ పంపై జిల్లా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా ప్రాఽథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతు లను సమీప ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు తరలిం చాలన్న ప్రతిపాదనలపై అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండ డంతో ఆ మేరకు జిల్లాలో ప్రభావం పడే పాఠ శాలలపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో హైస్కూలు ప్రాంగణంలోనే 41 ప్రాథమిక పాఠశాలలు, అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు ఉన్న ఆవరణలోనే ఐదు ప్రాధమిక పాఠశాలలు ఉన్నట్టు గుర్తించారు. ఇలా ఒకే ప్రాంగణంలోనే హైస్కూలు /యూపి స్కూలు ఉన్న చోట ప్రాధమిక పాఠశాలలు కూడా ఉండడం వలన 3, 4, 5 తరగతులు తరలించినా సంబంధిత విద్యార్థులకు దూరాభారం కాబోదని నిర్ధారణకు వచ్చారు. వీటితోపాటు గిరిజన, మునిసిపల్‌ పాఠశాలల మ్యాపింగ్‌ కూడా పూర్తి చేశారు. ఆ ప్రకారం ప్రభుత్వ ప్రతిపాదనలను అమలు చేయాల్సి వస్తే జిల్లాలో సుమారు 2 వేల 400 ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 80 వేల మందికిపైగా 3, 4,5 తరగతులు చదివే పిల్లలు కనిష్టంగా మూడు కిలోమీటర్లు, గరిష్టంగా ఆరు కిలోమీటర్ల దూరంలోని యూపి/ హైస్కూళ్ళకు వెళ్ళాల్సి ఉంటుందని భావిస్తు న్నారు. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితర డెల్టా మండలాల్లో ప్రాధమిక పాఠశా లలకు, ప్రాధమికోన్నత/ఉన్నత పాఠశా లలకు మధ్య 5–6 కిలోమీటర్ల దూరం ఉందని గుర్తించారు. ఈ క్రమంలో నూతన విద్యా విధా నాన్ని ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం పట్టుబడితే తొలుత ఎటువైపు నుంచీ ప్రతిఘటనలు రాకోకుండా, విద్యార్థులకు నష్టం కలుగకుండా ఉండేందుకు మధ్యే మార్గంగా ప్రస్తుతానికి యూపి/హైస్కూల్‌ ప్రాంగణంలోనే నిర్వహి స్తోన్న ప్రాధమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించి అక్కడే నిర్వహించడం వలన ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకా శాలు ఉండవని భావిస్తున్నారు. దీంతోపాటే పూర్వ ప్రాధమిక విద్య పిపి–1, 2, ప్రిపరేటరీ–1 తరగతులను ప్రాధమిక పాఠశాలల్లోనే నిర్వహించేలా అవసరమైనన్ని నూతన తరగతి గదులు నిర్మించవచ్చునని సమాచారం.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad