Trending

6/trending/recent

Model Schools: మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ ప్రవేశాలు

  • ఈ నెల 10 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

Model Schools: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించనున్నా మని, ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 100 చెల్లించాలన్నారు. విద్యార్థులు 'డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ. ఏపీఎంఎస్.ఏపీ.జీవోవీ.ఐఎన్' లేదా‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్' ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయ వచ్చని తెలిపారు. దరఖాస్తును ప్రింట్ తీసుకొని జూన్ 30వ తేదీలోగా సంబంధిత మోడల్ స్కూళ్లు ప్రిన్సిపాళ్లకు అందజేయాలన్నారు. ఆఫ్లైన్ దరఖా స్తులను స్వీకరించబోరని చెప్పారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad