Trending

6/trending/recent

Job Calendar: జాడ లేని జాబ్‌ కేలండర్‌

  • ‘ఏటా’ ఇస్తామని చెప్పి ఇప్పటికి రెండేళ్లు
  • రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం
  • పలు విభాగాల్లో ఖాళీగా లక్షకుపైగా కొలువులు
  • పదవిలోకి వచ్చిన కొత్తలో కొంత హడావుడి
  • డీఎస్సీ, పోలీసు, ఏపీపీఎస్సీపై ప్రకటనలు
  • ఏవో సాకులతో ఎప్పటికప్పుడు వాయిదా
  • భర్తీలు లేక పనిచేసేవారిపై డబుల్‌ భారం
  • పోస్టులు గుర్తించి..నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చుగా?
  • కేలండర్‌ ఇవ్వడానికి కరోనా అడ్డం వచ్చిందా?
  • ఆగ్రహంతో ప్రశ్నిస్తున్న నిరుద్యోగ యువకులు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా, ఏటా జాబ్‌ కేలండర్‌ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. 

అప్పటినుంచి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ, కేలండర్‌ రాలేదు. టీచర్లు, పోలీసులు ఇలా చెప్పిన ఏ డిపార్టుమెంట్‌లోనూ ఒక్క నోటిఫికేషనూ విడుదల కాలేదు. 

జాబ్‌ కేలండర్‌పై ఇలా..

2019 అక్టోబరు 2 : తూర్పుగోదావరి జిల్లా కరవ గ్రామంలో జరిగిన సభలో 2020 జనవరిలో ఇయర్‌ కేలండర్‌ ఇస్తామన్న సీఎం జగన్‌.      

2020 ఫిబ్రవరి 21 :  ఇయర్‌ కేలండర్‌పై అప్పటి సీఎస్‌ నీలంసాహ్ని సమీక్ష. కానీ ప్రకటించలేదు. కరోనా కారణం చూపి వాయిదా.

2021 ఏప్రిల్‌ 7 : ఉగాది సందర్భంగా జాబ్‌ కేలండర్‌ ఇస్తామంటూ మళ్లీ సీఎం జగన్‌ ప్రకటన. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నిక కోడ్‌ సాకుగా చూపుతూ మే 31న కేలండర్‌ ఇస్తామన్నారు. ఆ గడువూ దాటిపోయింది. 

పోలీసుల భర్తీపై అలా..

2020 అక్టోబరు 21 : ప్రతి సంవత్సరం 6 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఇస్తామని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్వయంగా సీఎం ప్రకటన. హోంమంత్రి సుచరిత కూడా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై పలుమార్లు ప్రకటన..

డీఎస్సీ నోటిఫికేషన్‌పైనా..

2020 నవంబరు 12 : త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటన.

ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు భరోసానిచ్చే ప్రకటనలెన్నో చేసింది. ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామనేది అందులో అతి ముఖ్యమైనది. యువతలోనేకాకుండా, వారి కుటుంబాల్లోనూ గొప్పఆశను రేపింది జాబ్‌ కేలండర్‌ ప్రకటన. అయితే, అధికారంలోకి వచ్చేసి రెండేళ్లు పూర్తయినా.. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేలెండర్‌ జాడ లేదు. ఏపీపీఎస్సీ , పోలీస్‌, డీఎస్సీ రిక్రూట్‌మెంట్లకు సంబంధించి ఒక్క కొత్త నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు.

డిగ్రీ, పీజీ చదువులు పూర్తిచేసిన లక్షలాదిమంది నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. 2020 జనవరి ఫస్ట్‌ కల్లా కొత్త రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇయర్‌ కేలెండర్‌ విడుదల చేస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్‌ ప్రకటించారు. అంతే కాదు ఇకపై ప్రతి సంవత్సరం ఇదే విధానం ఉంటుందని కూడా చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులను పిలిపించుకుని ఖాళీల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఏపీపీఎస్సీ ఇయర్‌ కేలండర్‌ మాటే మరిచారు. వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు అతీగతీ లేదు. అదిగో, ఇదిగో అంటూనే కాలయాపన చేస్తున్నారుతప్ప కార్యాచరణ ప్రణాళిక దిశగా అడుగులు పడటంలేదు. 

ఉన్న టీచర్లపై బండెడు భారం...

రిటైర్మెంట్‌, విద్యార్థుల సంఖ్య పెరుగుదల కారణంగా ఏటా ఉపాధ్యాయ నియామకాలు జరపాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం 2018 డిసెంబరులో చివరిసారిగా గ్రూప్‌-3 సర్వీసుల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంఽధించి 2019లో పరీక్ష నిర్వహించారు. అదే ఏడాది అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం.. ఈ పోస్టులకు జిల్లాలవారీగా నియామకాలు చేపట్టి దాన్ని తన ఖాతాలో వేసుకొంది. పదవిలోకి వచ్చిన ఇన్నాళ్లలో వైసీసీ ప్రభుత్వం చేసిందేమైనా ఉందంటే, పదోతరగతి కనీస ఉత్తీర్హతగా రాష్ట్రమంతా వలంటీర్లను, ఇంటర్‌, సాధారణ డిగ్రీ కనిష్ఠ అర్హతగా గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగ పోస్టులను భర్తీ చేసింది. అదేసమయంలో పీజీతో పాటు ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేసిన నిరుద్యోగుల గురించి ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. అనేక సార్లు జాబ్‌ కేండర్‌పై ప్రకటనలు చేయడం, సమావేశాలు, సమీక్షలు నిర్వహించడం తప్ప అడుగుముందుకు పడటం లేదు. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టులను గుర్తించేందుకు కాలయాపన ఎందుకో అంతుబట్టడంలేదని నిరుద్యోగులు లోకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడగని వర్గాలకు కూడా రకరకాల పేర్లతో సంక్షేమ పథకాలను ప్రకటిస్తోన్న ప్రభుత్వం...లక్షలాది మంది నిరుద్యోగుల భవితవ్యం గురించి ఏ మాత్రం ఆలోచన చేయడం లేదని పలువురు వాపోతున్నారు.

సడలింపు ఇచ్చి ఏం లాభం?

నిరుద్యోగుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు సడలిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సడలింపు సెప్టెంబరు 30 వరకే వర్తిస్తుంది.  కానీ నోటిఫికేషన్ల జాడ లేకపోవడంతో ఈ సడలింపు వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సడలింపునే కొనసాగించడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని పలువురు అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు. రాబోయే నోటిఫికేషన్లను దృష్టిలోపెట్టుకుని గరిష్ఠ వయోపరిమితిని 46 లేదా47 సంవత్సరాల వరకు సడలించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకు కటా్‌ఫగా 2021 సంవత్సరాన్ని ఈ ఒక్క సారికి ప్రకటించాలని కోరుతున్నారు. ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని కష్టపడుతున్న నిరుద్యోగుల్లో సింహభాగం.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం వల్ల వయోపరిమితి సడలింపు అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇక డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాల వరకు ఉంది. కానీ అది ఎప్పటివరకు అమల్లో ఉంటుందనేది నిరుద్యోగుల్లో సందిగ్దత నెలకొంది. ఇప్పటికైనా కొత్త నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం మార్గం సుగమం చేయాలని పలువురు కోరుతున్నారు. 



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad