Trending

6/trending/recent

Grading: పాఠశాల విద్యపై రాష్ట్రాలకు కేంద్రం గ్రేడింగ్: ఏపీ, తెలంగాణ స్థానాలివీ: నాడు-నేడు ఎఫెక్ట్

అమరావతి: పాఠశాల విద్యలో మార్పులు చేర్పులు చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని జారీ చేసింది. 

దీనికి సంబంధించిన పెర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశ్శాంక్..ఈ మధ్యాహ్నం దేశ రాజధానిలో ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాఠశాల విద్యలో చేసిన మార్పులు, ప్రక్షాళనకు అనుగుణంగా గ్రేడింగ్ విధానాన్ని ఇచ్చారు.

వెయ్యి మార్కులకు సంబంధించిన స్కోరింగ్ ఇది. దీన్ని లెవెల్ 1 నుంచి 10 వరకు విభజించారు. గ్రేడింగ్ ఇచ్చారు. 950కి పైగా స్కోర్ సాధించిన రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలను లెవెల్ 1లో చేర్చారు. 900-950 స్కోర్ ఉన్న ఆయా రాష్ట్రాలకు లెవెల్ 2, 851 నుంచి 900 స్కోర్ నమోదు చేసిన వాటికి లెవెల్ 3, 801 నుంచి 850 ఉన్న వాటి రాష్ట్రాలను లెవెల్ 4, స్కోర్ 751 నుంచి 800 మధ్య ఉన్న రాష్ట్రాలను లెవెల్ 5 కిందికి చేర్చారు. దీనికి అనుగుణంగా గ్రేడింగ్‌లు ఇచ్చారు.

ఇందులో లెవెల్ 1లో ఏ ఒక్క రాష్ట్రం గానీ, కేంద్ర పాలిత ప్రాంతం గానీ చోటు దక్కించుకోలేదు. లెవెల్ 2లో అత్యధిక గ్రేడింగ్ సాధించిన రాష్ట్రాలకు 1++ గ్రేడింగ్ ఇచ్చారు. ఈ కేటగిరీలో పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ అండ్ నికోబార్, కేరళ నిలిచాయి. లెవెల్ 3 విభాగంలో గ్రేడ్ 1+ సాధించిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలి, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్సీటీ, పుదుచ్చేరి, రాజస్థాన్ ఉన్నాయి.

లెవెల్ 4 కింద మంజూరు చేసిన గ్రేడ్ 1లో ఏపీ, పశ్చిమ బెంగాల్, దమన్ అండ్ డయ్యు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, త్రిపుర, ఉత్తర ప్రదేశ్ నిలిచాయి. లెవెల్ 5 కింద గ్రేడ్ 2గా గుర్తించిన రాష్ట్రాల్లో గోవా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లక్షద్వీప్, మణిపూర్, సిక్కిం, తెలంగాణ ఉన్నాయి. అస్సాం, బిహార్, మధ్యప్రదేశ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, మేఘాలయా, లఢక్.. లెవెల్ 6 నుంచి లెవెల్ 10 మధ్య నిలిచాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad