Trending

6/trending/recent

Good News: ఏపీలో ఉద్యోగులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ వాహనాలు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

Good News: ఓ వైపు కరోనా టెన్షన్.. మరోవైపు రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు. ఇప్పటికే ఏపీలో లీటరు పెట్రోల్ ధర 100 దాటింది. డీజిల్ ధర కూడా వందకు చేరువువుతోంది. 

దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే వణుకుపుడుతోంది. ఇలా పెట్రోల్ ధరలు భయపెడుతున్న వేళ ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) ఈ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్‌ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వరంగ సంస్థల్లోని ఆసక్తిగల సిబ్బంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సమాచారం పంపింది. బ్యాటరీ సామర్థ్యం, వేగం ఆధారంగా వాహనాల ధర ఉంటుందని నెడ్‌క్యాప్ సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో సుమారు 80 లక్షల ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయి. అంటే సగటున ఒక్కో వాహనానికి రోజుకు అర లీటరు పెట్రోలు వంతున వాడినా, 40 లక్షల లీటర్లు అవసరం అవుతుంది. వీటివల్ల వెలువడుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను కొంతైనా తగ్గించడానికి విద్యుత్‌ వాహనాల వాడకాన్నిప్రోత్సహించాలని నెడ్‌క్యాప్‌ భావిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉండగా.. తొలివిడతలో లక్ష మందికి వీటిని అందిస్తుంది. నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు వాహనాల నిర్వహణ బాధ్యత కూడా తయారీ సంస్థదే.

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగస్తులు మాత్రం ఫుల్ హ్యాపీ అంటున్నారు. ఓ వైపు కరోనా విస్తరణ, లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు.. వీటికి తోడు రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్ రేట్లతో వాహనాలు బయటకు తీయాలంటే భయమేస్తోందని.. ఎలక్ట్రిక్ బైక్ లతో ఆ టెన్షన్ తప్పుతుంది అంటున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్ లకు డిమాండ్ ఉంటుందని అలాంటి సమయంలో కొనడం కూడా కష్టంగా ఉంటుందని.. ఇప్పుడు అనుకూల ఈఎంఐలతో ప్రభుత్వమే బైక్ లు అందిస్తామంటే హ్యాపీనే.. తీసుకోడానికి సిద్ధంగా ఉంటామంటున్నారు కొందరు ఉద్యోగులు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad