Trending

6/trending/recent

Gold & Silver Rate 13-6-2021: పసిడి ప్రియులకు శుభవార్త ఈరోజు కొంతమేర దిగివచ్చిన పసిడి ధర

 Gold & Silver Rate 13-6-2021:  దేశీయంగా గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. అయితే నిన్నటి తో పోలిస్తే ఆదివారం ఉదయానికి పసిడి కొంత మేర దిగి వచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనీ భావించే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. శనివారం పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి.. ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో ఆదివారం ఉదయానికి పది గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 45,750లుగా ఉంది. నిన్నటి తో పిలిస్తే ఈరోజు రూ. 350 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర ఈరోజు 49,900 లుగా ఉంది. నిన్నటి నుంచి ఈ రోజుకు రూ. 400 మేర తగ్గింది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యపట్టణాలైన విజయవాడ , విశాఖపట్నంల్లో కూడా కొనసాగుతున్నాయి.

అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో మాత్రం 22 క్యారెట్స్ బంగారం ధర ఈరోజు రూ. 47,740 లు ఉండగా.. 24 క్యారెట్స్ ధర 48,740 లు ఉంది.

ఓ వైపు పసిడి నేలకు దిగి వస్తుంటే.. మరోవైపు వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. శనివారం వెండి ధర భారీ పెరిగింది. అయితే ఆదివారం ఉదయానికి వెండి ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర 77,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad