Trending

6/trending/recent

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగారాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

 Today Gold Rates: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇటీవల భారీగా పెరిగిన ధరలు కాస్త ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకోసమే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే.. తాజాగా బంగారం ధరల్లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశంలో స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం బంగారం ధర భారీగా తగ్గింది. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర మేర రూ. 48,350 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.600 మేర తగ్గి.. 47,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 51,490 గా ఉంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,350 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,350 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,250 వద్ద ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.600మేర తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.660మేర తగ్గింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,250 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,270 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,270 వద్ద కొనసాగుతోంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad