Trending

6/trending/recent

EAMCET: ఏపీ ఎంసెట్ పరీక్షల తేదీలు ఖరారు.. జూన్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

EAMCET:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీ ఎంసెట్ పరీక్షలను ఆగష్టు 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుండి జూలై 25వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు.

రూ. 500 ఫైన్‌తో జూలై 26 నుండి ఆగష్టు 5 వరకు, అలాగే రూ. 1000 లేట్ ఫీజుతో ఆగ‌ష్టు 6 నుండి ఆగష్టు 10 వరకు.. రూ. 5000 లేట్ ఫీజుతో ఆగ‌స్టు 11 నుండి ఆగష్టు 15 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో ఆగ‌స్టు 16 నుండి ఆగష్టు 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad