Trending

6/trending/recent

Corona Vaccine: శుభవార్త.. గర్భిణులకు కూడా కరోనా వ్యాక్సిన్

Corona Vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్ను గర్భిణులకు కూడా ఇవ్వవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. గర్భిణులకు ఈ వ్యాక్సిన్ ఉపయోగకరమేనని పేర్కొంది. అయితే బాలలకు టీకాలు ఇవ్వడంపై ఇంకా చర్చ జరుగుతున్నట్లు తెలిపింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరపున విలేకర్ల సమావేశంలో ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ, గర్భిణులకు కోవిడ్ టీకాలు ఇవ్వవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొందని తెలిపారు. వ్యాక్సిన్లు గర్భిణులకు ప్రయోజనకరమేనని, వాటిని వారికి ఇవ్వాలని అన్నారు.

బాలలకు వ్యాక్సినేషన్పై సరైన సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు చర్చనీయాంశమేనని తెలిపారు. బాలలకు టీకాలు వేస్తున్న దేశం ఒకటే ఉందన్నారు. చాలా చిన్న పిల్లలకు సైతం టీకాలు ఇవ్వాలా? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉందన్నారు. బాలలకు టీకాకరణపై మరింత సమాచారం వచ్చే వరకు బాలలకు టీకాలు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం రెండేళ్ళ నుంచి పద్దెనిమిదేళ్ళ వయసు బాలలకు టీకాలు ఇవ్వడంపై అధ్యయనం జరుగుతోందని, దీని ఫలితాలు సెప్టెంబరునాటికి రావచ్చునని తెలిపారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad