Trending

6/trending/recent

Corona Leave: కరోనా సోకిన వారికి సాధారణ శలవులు వర్తింప చేస్తూ త్వరలో ఉత్తర్వులు

Corona Leave: కరోనా సోకిన ఉద్యోగులకు 21 రోజుల సాధారణ సెలవుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఫైలు ఆర్థికశాఖ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఉద్యోగ సంఘాలన్నీ ఈ సెలవు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రభుత్వ స్థాయిలో ఇంతవరకు ఉన్న కొన్ని ఇబ్బందులు పరిష్కారమయ్యాయని, ఇక ఉత్తర్వులు వెలువడేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిసింది. కరోనా 2020 మార్చి నెల నుంచే తన ప్రతాపం చూపడం మొదలయింది. ఎందరో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అప్పటి నుంచి ప్రత్యేక సాధారణ సెలవు కోసం డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అప్పట్లో 28 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధమయింది. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 28 రోజుల సెలవు ప్రతిపాదన పంపగా అప్పట్లో ముఖ్యమంత్రి దీన్ని వెనక్కు పంపారు. 28 రోజులు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే విషయంలో అస్పష్టత వల్ల ఆ ఫైలు మళ్లీ వెనక్కు వచ్చిందని సమచారం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరోనా నేపథ్యంలో సెలవులపై ఉత్తర్వులు వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు, రాయితీలు కల్పించే విషయంలోను ఒక ప్రాతిపదిక ఆధారమయింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయని, ఇందుకు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad