Trending

6/trending/recent

AP Exams Cancelled: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు.. అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఆది మూల‌పు..

 AP Exams Cancelled: క‌రోనా కార‌ణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌ని ఏపీ ప్ర‌భుత్వం.. అంతా అనుకూలించ‌న త‌ర్వాత ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పింది.

దీంతో అస‌లు ఏపీలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారా.? లేదా అని ప్ర‌శ్న‌లు త‌లెత్తుతోన్న వేళ‌. కాసేప‌టి క్రిత‌మే విద్యాశాఖ మంత్రి ఆది మూల‌పు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ఇంట‌ర్‌, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస‌స్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సుప్రీం ఆదేశించిన విధంగా ప‌ది రోజుల్లో ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేయ‌లేని కార‌ణంగా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. విద్యార్థులు ఏ ర‌కంగా ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి తెలిపారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో మార్కులు ఎలా ఇస్తామ‌న్న విష‌యాన్ని త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి తెలిపారు. మార్కుల‌ను కేటాయించే క్ర‌మంలో ఒక హై ప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద ల్యాబ్స్ మార్కులు మాత్ర‌మే ఉన్నాయ‌ని మంత్రి చెప్పుకొచ్చారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad