Trending

6/trending/recent

10th Inter Examinations: జూలై చివరి వారం పదవ తరగతి పరీక్షలు...

  • 2008 డీఎస్సీ బ్యాచ్ కు త్వరలో పోస్టింగులు
  • జులై చివరి వారంలో 10 పరీక్షలు
  • విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి

10th Examinations: జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆయన మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. 2008 డీఎస్సీలో అర్హత సాధించిన వారి సమస్య 13 ఏళ్లుగా పెండింగులో ఉందని, వారికి ఎస్ జీ టీలుగా పోస్టింగులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి చెప్పారు. ఆ డీఎస్సీకి సంబంధించిన 2,193 మందికి పోస్టింగులు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం జగన్ నెరవేర్చారన్నారు. త్వరలో జీవో ఇచ్చి నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి చెప్పారు. 1998 డీఎస్సీ వారికి న్యాయం చేస్తామన్నారు. జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలను, చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మంత్రి వివరించారు. సీఎం తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరీక్షల రద్దు వల్ల వచ్చే పర్యవసానాలు కూడా ఆలోచించాలని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.



Post a Comment

2 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad