Trending

6/trending/recent

Super Blood Moon: నేడే ‘సూపర్ బ్లడ్‌మూన్’.. ఆకాశంలో కనువిందు చేయనున్న చంద్రుడు

Lunar Eclipse 2021: ఆకాశంలో ఈ రోజు అపురూప దృశ్యం ఆవిష్కృతం కానుంది. బుధవారం (మే 26) సాయంత్రం సంపూర్ణ చంద్ర గ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి కనువిందు చేయనున్నాయి. సూపర్‌ బ్లడ్‌ మూన్‌, చంద్రగ్రహణం ఒకేరోజున ఏర్పడమనేది సాధారణంగా ప్రతీ ఆరేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తాయి. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. చంద్రుడు.. భూమికి దగ్గరగా రానుండటంతో సాధారణ రోజుల కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించనున్నాడు. దీనినే సూపర్ మూన్‌గా పిలుస్తారు.

అయితే.. సూపర్‌మూన్‌-చంద్రగ్రహణాన్ని అమెరికా, కెనడా, మెక్సికో, మధ్య అమెరికా, ఈక్వెడార్‌, పశ్చిమ పెరూ, దక్షిణ చిలీ, అర్జెంటీనా వాసులు చూడొచ్చు. మన దేశం నుంచి పాక్షిక చంద్రగ్రహణాన్ని మాత్రమే వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమై 6.22 గంటలకు ముగుస్తుంది. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.58 గంటల మధ్య ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్‌-నికోబార్‌ దీవుల వాసులు పాక్షిక చంద్రగ్రహణ దృశ్యాల్ని చూడొచ్చంటూ వెల్లడించారు. పూర్తి దశ 4.58 నిమిషాలకు ప్రారంభమై.. 6.23 గంటలతో ముగుస్తుంది. అయితే.. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్ రెండూ ఒకేసారి కనువిందుచేయనుండటంతో ఇది ప్రత్యేకమైనదిగా మారింది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad