Trending

6/trending/recent

Pre Primary Schools: ప్రీ ప్రైమరీ పాఠశాలలు దగ్గరగా ఉండాలి

  • సమీక్షలో సిఎం జగన్

ప్రీ ప్రైమరీ పాఠశాలలు పిల్లలకు చాలా దగ్గరగాఅందుబాటులో ఉండాలని, ఆ విధంగా మ్యాపింగ్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యపై సిఎం తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఫౌండేషనల్ పాఠశాలలు కిలోమీటర్ దూరంలోపు ఉండాలని, హైస్కూళ్లు మూడు కిలోమీటర్ల లోపు ఉండాలని చెప్పారు. టీచర్లలోని బోధనా సామర్ధ్యాన్ని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలని తెలిపారు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందో. పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి, తదుపరి సమీక్షలో నివేదించాలని ఆదేశించారు. ఒకవేళ వాటిని అమలు చేయాల్సొస్తే ముందుగా 3, 4, 5 తరగతులను యుపి స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖరారైన తరువాత ఫౌండేషనల్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. స్థానిక ప్రాధకమిక పాఠశాలల్లో అంగన్వాడీలు (పిపి-1, పిపి-2) 1, 2తరగతులు ఫౌండేషనల్ స్కూళ్ల ఏర్పాటు తరువాత డిజిటల్ బోధన ప్రక్రియ (డిజిటల్ టీచింగ్)పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రతి మండలంలోనూ జూనియర్ కళాశాలలు ఒకటా, రెండు ఏర్పాటు చేయాలా... అన్న దానిపై పూర్తిస్థాయి పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్కు బదలాయించాలని తెలిపారు. సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది ఉన్నందు వల్ల వీరికి మంచి సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. ఫౌండేషనల్ స్కూళ్ల ఏర్పాటు వల్ల అధ్యాపక స్రవంతిలోకి అంగన్వాడీ టీచర్లను తీసుకురావాలని అధికారులు సిఎంకు ప్రతిపాదించారు. ప్రమోషన్ల ద్వారా ప్రైమరీ స్కూళ్లలో ఎస్ జిటిలుగా అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, మహిళా క్షేమశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, ముఖ్య కార్యదర్శులు బి. రాజశేఖర్, ఎఆర్ అనురాధ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్, పాఠశాల విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్లు వి.చినవీరభద్రుడు, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad