Trending

6/trending/recent

NCRTC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్‌సీఆర్‌టీసీలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

 NCRTC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేష‌నల్ క్యాపిటల్ రీజియ‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్‌(ఎన్‌సీఆర్‌టీసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో మొత్తం 20 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అనుభ‌వం ఉన్న వారిని ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా సీనియ‌ర్ డిజైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, అడిష‌న‌ల్ డిజైన్ ఎక్స్‌ప‌ర్ట్‌, అసిస్టెంట్‌ సైట్ అసోసియేట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగాల్లో బీఆర్క్‌, బీఈ/ బీటెక్‌(సివిల్‌/ స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌), ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్ లేదా ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్య‌ర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

* ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు applyonline@ncrtc.in ఐడికి.. ఆఫ్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకునే వారు న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌రాఖ‌స్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 11.06.2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad