Trending

6/trending/recent

LIC Bima Jyoti: ఈ పాలసీలో ప్రీమియం ఎంత చెల్లిస్తే అంతకు డబుల్ బెనిఫిట్

 LIC Bima Jyoti | ఎల్ఐసీ ఇటీవల బీమా జ్యోతి పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో మీరు ప్రీమియం ఎంత చెల్లిస్తే అంతకు రెండు రెట్లు రిటర్న్స్ వస్తాయి. ఈ పాలసీ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

1. మీరు ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC బీమా జ్యోతి పేరుతో పాలసీని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే మీరు చెల్లించిన ప్రీమియం కన్నా రెట్టింపు రిటర్న్స్ పొందొచ్చు.

2. మీరు రూ.10,00,000 ప్రీమియం చెల్లిస్తే రూ.20,00,000 వరకు రిటర్న్స్ వస్తాయి. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ సేవింగ్స్ ప్లాన్. ప్రతీ సంవత్సరం బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు 5 శాతం వరకు గ్యారెంటీడ్ అడిషన్ అదనంగా లభిస్తుంది. అంటే ప్రతీ రూ.1,000 కి రూ.50 గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది.

3. కనీసం రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీలో మరో ప్రత్యేకత ఏంటంటే మీరు 20 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. అంటే మీరు పాలసీ ఎంత కాలానికి తీసుకున్న ఐదేళ్ల ముందే ప్రీమియం చెల్లింపు ఆగిపోతుంది.

4. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. పాలసీ టర్మ్ 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుంది. మెచ్యూరిటీకి కనీస వయస్సు 18 ఏళ్లు. మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు 75 ఏళ్లు.

5. ఈ పాలసీలో ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్స్ తీసుకోవచ్చు.

6. పాలసీ చెల్లిస్తున్న సమయంలో పాలసీదారుడు మరణిస్తే సమ్ అష్యూర్డ్ నామినీకి లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. దీంతో పాటు ప్రతీ ఏటా సమ్ అష్యూర్డ్‌కు ప్రతీ రూ.1,000 కి రూ.50 గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది.

7. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.10,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ బీమా జ్యోతి పాలసీ తీసుకున్నాడనుకుందాం. 15 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. ఏటా రూ.78,771 ప్రీమియం చెల్లించాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000 కాగా మరణిస్తే వచ్చే సమ్ అష్యూర్డ్ 12,50,000. దీంతో పాటు ప్రతీ రూ.1,000 కి రూ.50 గ్యారెంటీడ్ అడిషన్ ప్రతీ ఏటా లభిస్తుంది.

8. ఈ లెక్కన 15 ఏళ్లల్లో రూ.11,81,550 ప్రీమియం చెల్లించాలి. 20 ఏళ్ల తర్వాత రూ.10,00,000 సమ్ అష్యూర్డ్‌తో పాటు రూ.10,00,000 గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. అంటే మొత్తం రూ.20,00,000 రిటర్న్స్ పొందొచ్చు. 20 ఏళ్లకు డెత్ బెనిఫిట్ రూ.22,50,000. ఇది చెల్లించిన ప్రీమియం కన్నా దాదాపు రెట్టింపుతో సమానం.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad