Trending

6/trending/recent

Lactating Women Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న త‌ల్లులు.. పిల్ల‌ల‌కు ఎప్ప‌టి నుంచి పాలివ్వొచ్చు..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

Lactating Women Vaccine: దేశంలో క‌రోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా క‌ట్ట‌డికి మ‌న‌కు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్ అనే విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్ అందుబాటులోకి ఇచ్చింది. ఇత‌ర దేశాల‌కు చెందిన వ్యాక్సీన్లు కూడా భార‌త్‌లో వినియోగానికి అనుమ‌తులు ల‌భించాయి.

అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్ప‌టికీ వ్యాక్సిన్‌పై ప‌లు అనుమానాలు వ్యక్త‌మ‌వుతూనే ఉన్నాయి. ఆ దిశ‌లో శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌నలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా వ్యాక్సిన్‌పై ఉన్న ఓ అపోహ‌పై కేంద్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న త‌ల్లులు రెండు రోజుల పాటు చిన్నారుల‌కు పాలు ఇవ్వ‌కూడ‌ద‌నే ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేద‌ని.. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత వెంట‌నే పాలు ఇచ్చినా ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని అధికారులు క్లారిటీ ఇచ్చారు. వ్యాక్సిన్‌కు పిల్ల‌ల‌కు పాలు ఇవ్వ‌డానికి ఎలాంటి సంబంధం లేద‌ని నీతి ఆయోగ్ హెల్త్ స‌భ్యులు వీకే పాల్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో వ్యాక్సినేష‌న్ అందుబాటులోకి వ‌చ్చిన మొద‌ట్లో గ‌ర్భిణీలు, పాలు ఇచ్చే త‌ల్లుల‌ను వ్యాక్సినేష‌న్ ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అనంత‌రం వీరిపై ప‌రిశోధ‌నలు జ‌రిపిన శాస్త్ర‌వేత్త‌లు తాజాగా పాలిచ్చే త‌ల్లులు ఎలాంటి సందేహం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని నిర్ధారించారు. ఇక గ‌ర్భిణీల విష‌యంపై మాత్రం ఇంకా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. మ‌రికొన్ని రోజుల్లో దీనిపై కూడా ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే త‌ల్లికి క‌రోనా ఉన్నా బిడ్డ‌కు పాలు ఇవ్వ‌డం ద్వారా వైర‌స్‌ వ్యాపించ‌ద‌నే విష‌యాన్ని అధికారులు ఇది వ‌ర‌కే స్ప‌ష్టం చేశారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad