Trending

6/trending/recent

India Covid 19: ఇండియాలో నిమిషానికి 287 కరోనా కేసులు, గంటకు 163 మరణాలు

 Covid 19 Updates: ఇండియాతోపాటూ ప్రపంచ దేశాల్లో రెండు రకాల కోణాలు కనిపిస్తున్నాయి. కొందరు కరోనా అంత ప్రమాదకరం కాదు అంటుంటే మరికొందరు అది చాలా ప్రమాదకరం అంటున్నారు. మరి మనం ఎవరి మాట నమ్మాలి?

ఇండియాలో రోజూ 4లక్షలకు పైగా కరోనా కేసులు వస్తుంటే... చాలా దేశాల్లోని చాలా మంది పరిశోధకులు, నిపుణులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇండియాపై చులకనగా మాట్లాడుతుంటే... కొంత మంది లాక్‌డౌన్ పెట్టాలని హెచ్చరికలు చేస్తున్నారు. మరికొందరు ఏదో జరిగిపోతోందన్నట్లు ఆందోళన కలిగిస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఇండియాలో కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఒకరు మాత్రమే చనిపోతున్నారని ప్రస్తుత లెక్కలు చెబుతున్నాయి. మిగతా 99 మంది కోలుకుంటున్నారు. ఆ చనిపోతున్న వారిలో కూడా 51 శాతం మందికి కరోనా కంటే ముందు ఇతరత్రా షుగర్, బీపీ, ఆస్తమా లాంటి దీర్ఘ కాలిక వ్యాధులు ఉంటున్నాయి. అంటే కరోనా అంత ప్రమాదకరమైనది కాదనే దాని అర్థం. సరైన టైమ్‌లో, సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చు. అందుకు కోలుకుంటున్నవారే ప్రత్యక్ష నిదర్శనం. అందువల్ల కరోనాను బూచిలా చూపిస్తూ... భయపెట్టే వారి మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు నిజం చెబుతున్నారా... లేక భయపెట్టి పరిస్థితి క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది మనమే గమనించుకోవాలి. 

అమెరికాలో అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ మరోసారి ఇండియాలో లాక్‌డౌన్ విధించడమే కరెక్ట్ అని అన్నారు. అటు అమెరికాలోని మోడెర్నా కంపెనీ సీఈఓ మరో 6 నెలల్లో కొత్త స్ట్రెయిన్ వస్తుందనీ... దాన్ని తట్టుకునే బూస్టర్ వ్యాక్సిన్ తయారుచేస్తున్నామని తెలిపారు.

ఏపీలో కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ బాగా ఉపయోగపడుతోందని తెలిసింది. సంవత్సర కాలంలో ఈ పథకం ద్వారా లక్షా 11 వేల 266 మంది ట్రీట్‌మెంట్ ఫ్రీగా పొందారు. కరోనా ట్రీట్‌మెంట్ల కోసం ప్రభుత్వం రూ.332 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా... ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనాకి ఉచితంగా చికిత్స అందిస్తోంది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మే 12 వరకూ సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వనున్నారు. అందులోనూ ఆదివారం 9వ తేదీన వ్యాక్సిన్ వెయ్యరు. కాబట్టి... సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మొదటి డోస్‌కి సంబంధించి మొబైల్‌కి వచ్చిన మెసేజ్ చూపిస్తే... రెండో డోస్ ఇస్తారు. ఇందుకు సంబంధించి స్పాట్‌లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి మొదటి డోస్ కావాలనుకునే 45 ఏళ్లు దాటిన వారు ఈ నెల 12 వరకూ వ్యాక్సిన్ కోసం వెళ్లకూడదు. వెళ్లినా వెయ్యరు. ఐతే... ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్కో వ్యాక్సిన్ డోస్‌కీ రూ.2,000 దాకా వసూలు చేస్తున్నారని తెలిసింది.

India Corona: ఇండియాలో కొత్తగా 4,14,188 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. కొత్తగా 3,915 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,34,083కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 3,31,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,76,12,351కి చేరింది. రికవరీ రేటు 81.9 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 36,45,164 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,26,490 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 29 కోట్ల 86లక్షల 01వేల 699 టెస్టులు చేశారు. కొత్తగా 23,70,298 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 16కోట్ల 49లక్షల 73వేల 058మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Telangana Covid: తెలంగాణలో కొత్తగా 5,892 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 4,81,640కి చేరాయి. కొత్తగా 9,122 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,05,164కి చేరింది. రికవరీ రేటు 84.12 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 46 మంది మరణించారు. మొత్తం మరణాలు 2625కి చేరాయి. మరణాల రేటు 0.54 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 యాక్టివ్ కేసులున్నాయి. 

GHMC పరిధిలో కొత్తగా 1104 కేసులొచ్చాయి. తెలంగాణలో కొత్తగా 76,047 కరోనా టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య కోటి 34లక్షల 23వేల 123కి చేరింది.

AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 1,00,424 టెస్టులు చెయ్యగా... కొత్తగా 17,188 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12,45,374కి చేరింది. కొత్తగా 73 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,519కి చేరింది. కొత్తగా 12,749 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 10,50,160కి చేరింది. ప్రస్తుతం 1,86,695 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,60,870 టెస్టులు జరిగాయి.

ప్రపంచదేశాల్లో కొత్తగా 8,32,579 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 15.75 కోట్లు దాటింది. కొత్తగా 13,666 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 32.83 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.86 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 47,152 కేసులు, 757 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 78,337 కొత్త కేసులు... 2,217 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ అత్యధిక కేసులు ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా, అర్జెంటినా, టర్కీ ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా, అర్జెంటినా, కొలంబియా ఉన్నాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad