Trending

6/trending/recent

Horoscope 25-5-2021: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కాస్తంత శ్రమ తప్పదు

 Horoscope today 25-5-2021: నేడు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి హెచ్చరిక సూచనలు ఉన్నాయి. మొత్తంగా నేటి రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope 25-5-2021: జ్యోతిష పండితులు జ్యోతిషం చెప్పేటప్పుడు చాలా సీరియస్‌గా ఉంటారు. వారికి ఈ శాస్త్రంపై పూర్తి పట్టు ఉంటుంది. ప్రతీ దానికీ లెక్క ఉంటుంది. ఒక్కో గ్రహానికి ఒక్కో లక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందో చెబుతారు. మన గ్రహాల్లో కుజ గ్రహమైన మార్స్ మనపై ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే శుక్ర గ్రహం ఏ రాశులకు దగ్గరగా ఉంటుందో... ఆ రాశుల వారికి ప్రేమ, పెళ్లి అంశాలపై ప్రభావం పడుతుంది. గురుగ్రహం దగ్గరగా ఉండే రాశులకు మంచి జరుగుతుంది. ఇలా గ్రహాలను బట్టీ రాశుల స్థితిగతులను నిర్ణయిస్తారు. మరి ఇవాళ ఏ రాశుల వారికి ఎలాంటి గ్రహ బలాలు ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (Aries) అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్‌ లభించే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పరవా లేదు.

వృషభ రాశి (Taurus) నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప్పు తీరుస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథున రాశి (Gemini) ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. దగ్గరి బంధువుతో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి (Cancer) అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. బంధువులొకరు మీ సలహాలు తీసుకుంటారు. కొత్తవారు పరిచయమవుతారు. ప్రేమ సంబంధమే ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది.

సింహ రాశి (Leo) ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పరిచయస్థులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుకు కళ్లెం వేయాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. చిన్న వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.

కన్య రాశి (Virgo) ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు ఎంతగానో సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిగకండి. త్వరలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులు అండదండలు అందిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మీరొకటి తలిస్తే దైవమొకటి తలుస్తారు.

తుల రాశి (Libra) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక రాశి (Scorpio) ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు పరవా లేదు.

ధనస్సు రాశి (Sagittarius) సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ గానీ, ఇంక్రిమెంట్‌ గానీ లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువులు సహాయ పడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారులు లాభాలు గడిస్తారు.

మకర రాశి (Capricorn) ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. దూరపు బంధువుతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభ రాశి (Aquarius) ఉద్యోగంలో అధికారులు మీ శ్రమను, ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారులకు కాలం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవా లేదు.

మీన రాశి (Pisces) ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. ఉద్యోగం సాఫీగానే సాగిపోతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనకు దిగవద్దు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad