Trending

6/trending/recent

Home Loans: గుడ్‌న్యూస్‌.. మ‌రింత చౌక‌గా హోం లోన్స్..!

 సొంత ఇంటి కోసం అంతా క‌ల‌లు కంటూనే ఉంటారు.. అయితే, ఆ క‌ల సాకారం చేసుకుని శుభ‌వార్త చెబుతోంది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)... ఇప్ప‌టికే అతిత‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను హోం లోన్స్ అందిస్తోన్న ఎస్బీఐ.. ఇప్ప‌డు ఆ వడ్డీరేట్లను మ‌రింత తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95 శాతం నుంచి 6.7 శాతానికి త‌గ్గించిన‌ట్టు తాజాగా ప్ర‌క‌టించింది..  ఈ నిర్ణయం త‌క్ష‌ణ‌మే అమల్లోకి వస్తుందని పేర్కొంది ఎస్బీఐ.. ఇక‌, మహిళా రుణ గ్రహీతలకు అయితే, 5 బేసిస్‌ పాయింట్ల ప్రత్యేక రాయితీ కూడా ఇస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇక‌, వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు త‌మ‌కు మ‌రింత క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తోంది ఎస్బీఐ.. సరసమైన ధరల్లో లభించే గృహాల రుణాలకు కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ఎస్బీఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండీ సీఎస్‌ శెట్టి తెలిపారు. 

ఇక‌, పూర్తిస్థాయిలో వ‌డ్డీరేట్ల‌ను ప‌రిశీలించిన‌ట్టు అయితే.. రూ.30 లక్షల వరకు గృహ రుణాలపై 6.7 శాతం వడ్డీయే ఉంటుంద‌ని ఎస్బీఐ పేర్కొంది.. అదే మహిళలైతే 6.65 శాతం వడ్డీకే రుణం పొందే ఆఫ‌ర్ తెచ్చింది... మ‌రోవైపు.. రూ.30 లక్షల నుంచి 75 లక్షల వరకుండే రుణాలపై వడ్డీరేటు 6.95 శాతంగా ఉండ‌నుండ‌గా.. రూ.75 లక్షలకుపైగా తీసుకునే రుణాలపై 7.05 శాతం వడ్డీని ఫైన‌ల్ చేసింది ఎస్బీఐ.. ఇక‌, ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్లు యోనో యాప్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీరేటుపై అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ పొంద‌వ‌చ్చు అంటోంది ఎస్బీఐ..



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad