Trending

6/trending/recent

Hero MotoCorp: భారత్​లో విడుదల కానున్న మొదటి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఎప్పుడో తెలుసా?

 ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​ తన మొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్​లో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్​ వాహనాల హవా కొనసాగనుంది. గత కొన్ని రోజులుగా దేశంలో ఈ–వెహికిల్స్​ వినియోగం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. పెట్రోల్​, డీజిల్​ ధరతో పాటు కాలుష్యం పెరుగుతుండటంతో ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్​ వాహనాల వైపు మళ్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ సంస్థలు సైతం ఎలక్ట్రికల్​ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే బజాజ్​, టీవీఎస్​ కంపెనీలు భారత మార్కెట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. వీటితో పాటు హోండా, రాయల్ ఎన్​ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. తద్వారా, ఈ రంగంలో తనదైన ముద్ర వేయడానికి హీరో మోటోకార్ప్​ సిద్దమవుతోంది.
తాజా ఒప్పందంలో భాగంగా తైవాన్​కు చెందిన బ్యాటరీ ఎక్స్చేంజ్ నెట్​వర్క్​ గొగొరో అనే కంపెనీతో హీరో సంస్థ చేతులు కలిపింది. త్వరలోనే ఈ రెండు కంపెనీలు కలిసి భారత మార్కెట్​లోకి ఈ–స్కూటర్​ను తీసుకొస్తామని ప్రకటించాయి. తమ మొదటి ఎలక్ట్రిక్​ వాహనాన్ని 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ వాహనం వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య భారత మార్కెట్​లోకి విడుదలయ్యే అవకాశం ఉందని ప్రముఖ బిజినెస్ న్యూస్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వూలో కంపెనీ సిఎఫ్‌ఓ నిరంజన్ గుప్తా తెలిపారు.

గొగొరో సంస్థతో భాగస్వామ్యం

హీరో నుంచి విడుదల కానున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూవీలర్​ మాస్ట్రో ఎడ్జ్​ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహన తయారీపై ప్రస్తుతం ట్రయల్స్​ నిర్వహిస్తోంది. ఈ–స్కూటర్ ప్రస్తుతం జైపూర్​లోని హీరో మోటోకార్ప్​ ఆర్ అండ్ డి సెంటర్ (సిఐటి)లో సిద్దమవుతోంది. దీని నమూనాను గతడాది నిర్వహించిన హీరో వరల్డ్ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో ఐసి ఇంజన్-శక్తితో కూడిన కౌంటర్​ను ఇది పోలి ఉంటుందని స్పష్టమైంది. దీనిలో గోల్డెన్​ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫోర్క్‌ ఎగ్జాస్ట్ సెటప్ ఉండే అవకాశం ఉంది.

ఇతర స్టైలింగ్ ఎలిమెంట్లను పరిశీలిస్తే.. LED హెడ్‌ల్యాంప్, బ్లాక్-అవుట్ విజర్, రియర్‌వ్యూ మిర్రర్స్​ వంటివి ఆశించవచ్చు. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డ్రైవ్, పార్క్, రివర్స్‌తో సహా మూడు రైడ్ మోడ్‌లతో రూపొందించబడుతుంది. వీటిని లెఫ్ట్​ హ్యాండ్​ స్విచ్ గేర్​తో నియంత్రించవచ్చు. కీలెస్ స్టార్ట్/ స్టాప్, ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా దీనిలో అందించనునున్నారు. ఈ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్​ టూవీలర్ భారత మార్కెట్​లో​ బజాజ్, టివిఎస్, అథర్, ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad