Trending

6/trending/recent

Elections: యమపాశాలైన ఎన్నికల విధులు ?.. కోవిడ్ కు బలైన ఉపాధ్యాయుల ప్రాణాలు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అసువులు.

  • యమపాశాలైన ఎన్నికల విధులు
  • కోవిడ్ కు బలైన ఉపాధ్యాయుల ప్రాణాలు
  • దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అసువులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల విధులు దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులను బలితీసుకున్నాయి. ఈ విధుల్లో పాల్గొన్న బోధన, బోధనేతర సిబ్బంది కోవిడ్ బాదినపడి ప్రాణాలు కోల్పోయారు. జనాభాలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో ఉపాధ్యాయులు ఎక్కువ మంది చనిపోయినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికలే వారి ప్రాణాలు తీశాయని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహార్, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయుల మరణాలకు ఎన్నికల విధులే కారణమని ఆరోపిస్తున్నారు. దేశంలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ చాపకింద నీరులా విస్తరిస్తున్న సమయంలో రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు అనేక రాష్ట్రాల్లో పంచాయితీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్ని కలు కూడా జరిగాయి. దేశంలో జరిగే ఏ ఎన్నికల నిర్వహణలోనైనా పాఠశాలలే పోలింగ్ కేంద్రాలు. వాటిలో పనిచేసే సిబ్బంది పోలింగ్ సిబ్బందిగా గా, పనిచేస్తుంటారు. అదే ఉపాధ్యాయుల పాలిన యమపాశంగా మారింది.

పెద్ద రాష్ట్రంలో ప్రాణాలు తీసిన పంచాయితీ ఎన్నికలు

 జనాభా ప్రకారం పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యన జరిగిన పంచాయితీ ఎన్నికలు అక్కడ సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది అత్యధికంగా మహమ్మారి. బారినపడ్డారు. వారిలో చాలా మంది కరోనాతో పోరాడుతూ మరణించారని ఉత్తరప్రదేశ్ ప్రాథమిక శిక్షర్ సంఘ్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ తొలి వారం నుంచి మే 10 వరకు యూపీలో ఏకంగా 1,621 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సంఘ్ వెల్లడించింది. ఇందులో 90 శాతానికి పైగా మరణాలు

పంచాయతీ ఎన్నికలకు హాజరైన సిబ్బందివే  అని ఆ సంస్థ "  స్పష్టం చేసింది. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ గణాంకాలను తప్పుబడుతోంది. కేవలం ముగ్గురు మాత్రమే. కరోనాతో మరణించారని చెబుతోంది. ఇదిలా ఉంటే, కరోనా బారిన పడిన ఉపాధ్యాయులు, సిబ్బందికి సరైన చికిత్స

అందించకపోవడం వల్ల అధిక మరణాలు సంభవించాయని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు.. ఉపాధ్యాయులకు వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించే పరికరాలను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేదని ఆమె మండిపడ్డారు. మరణించినవారికి కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కర్ణాటక 

ఉతర ప్రదేశ్ లో మాత్రమేకాదు, కర్ణాటకలోనూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. బసవకళ్యాణం.

నియోజకవర్గానికి, బీదర్ మున్సిపాలిటీకి ఏప్రిల్ 1 మే 14 తేదీల మధ్య ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల విధుల్లో 1,434 మంది బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందిలో ఏకంగా 52 మంది మరణించడం తీవ్ర కలకలానికి దారితీసింది. నిజానికి ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందిని ఎంపికచేసే క్రమంలోనే అందరికీ కోవిడ్ 18 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో 67 మందికి ఫలితం పాజిటివ్ రావడంతో వారిని విధులకు దూరంగా ఉంచారు. నెగెటివ్ రిజల్ట్ వచ్చినవారిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ విధులకు హాజరైనవారు. వరుసగా ఒక్కొక్కరు కరోనాబారిన పడడం, వారిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోవడంతో ఎన్నికల సమయంలోనే వారికి కరోనా సోకిందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరో 26 మంది ఉపాధ్యాయులు కరోనాతోపోరాడుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. సమాజ నిర్మాతలుగా చెప్పుకునే ఉపాధ్యాయుల గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వాపోయాయి. ఏ రాజకీయ పార్టీ కూడా వీటి గురించి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్లో ఏడాది కాలంలో 700 మంది!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది కాలంలో 700 మందికి పైగా ఉపాధ్యాయులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పో యినట్టు అక్కడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వారంతా తమను కూడా కోవిడ్ ఫ్రంట్ న్ వర్కర్ల జాబితా లో చేర్చి, వ్యాక్సిన్లను ప్రాధాన్యతా క్రమంలో అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికలే కారణమా!

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరించడానికి ఎన్నికలే కారణమని న్యాయ స్థానాలు సహా అనేక మంది వైద్య రంగ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు తప్పుబట్టాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆటు ప్రజలు, రాజకీయ పార్టీల కార్యకర్తలతో పాటు నేతలను ఇన్ఫెక్షన్ బారినపడేలా చేస్తే, పోలింగ్, కౌంటింగ్ విధులు ఎన్నికల సిబ్బందిని మహమ్మారివారిన పడేలా చేశాయని కొందరు సూత్రీకరిస్తున్నారు. కోవిడ్ 18 మార్గ దర్శకాలను అనుసరించి గౌజులు, శానిటైజర్లు, మాస్కు లు ధరించినప్పటికీ రోజు మొత్తమ్మీద దాహం వేసి నీళ్లు తాగే సమయంలోనో, లేక భోజన విరామ సమయం లోనో మాస్కులు తొలగించక తప్పదు. పైగా ఓటు వేయ దానికి వచ్చేవారికి ధర్మబ్ స్కానర్లతో మినహా మరేద కంగా పరీక్షించడం సాధ్యపడదు కాబట్టి, జ్వరం లక్షణాలు లేని కోడ్ బాధితులు కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇవన్నీ కలిపి ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందిని వైరస్ బారిన పడేలా చేశాయని భావిస్తున్నారు. నిజానికి సెకండ్ వేవ్ మహారాష్ట్ర, కేరళ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభ మైన పుడే ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాల్సిందని, అలా చేయకపోవడం వల్లనే దేశం ఇంత తీవ్రస్థాయిలో సమస్య లు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని విశ్లేషిస్తున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad