Trending

6/trending/recent

Cyber Attack: కొరియ‌ర్ సంస్థ పేరుతో ట్రాకింగ్ మెసేజ్‌.. క్లిక్ చేసే ఖేల్ ఖ‌తం.. ముందే జాగ్ర‌త్త ప‌డండి..

 Cyber Attack: సైబ‌ర్ నేర‌గాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. మ‌న ఆశ‌, అజ్ఞానాన్ని టార్గెట్ చేస్తూ సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు ఇళ్ల‌లో చొర‌బ‌డి దొంగ‌త‌నం చేసే వారు ఇప్పుడు ప్ర‌ప‌చంలో ఏదో మూల‌న కూర్చొని మ‌న బ్యాంకు ఖాతాల్లోని డ‌బ్బుల‌ను కొట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌న ఫోన్‌ల‌లోకి ర‌క‌ర‌కాల మాల్వేర్‌ల‌ను పంపిస్తూ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కొట్టేస్తున్నారు.

తాజాగా యూకే, స్పెయిన్‌, బ్రిట‌న్‌, జర్మ‌నీతో పాటు ప‌లు దేశాల్లో ఈ కొత్త ర‌కం మాల్వేర్ బాగోతం బ‌య‌ట‌కొచ్చింది. ఫ్లూ బాట్ పేరుతో చ‌లామ‌ని అవుతోన్న ఈ స్కామ్ ఆండ్రాయిడ్ ఆధారిత గ్యాడ్జెట్ల‌లోకి చొర‌బ‌డుతుంది. ఇందుకోసం సైబ‌ర్ నేర‌గాళ్లు.. ఫేక్ కొరియ‌ర్ ట్రాకింగ్ మెసేజ్‌ను ఎంచుకున్నారు. ఇంత‌కీ ఈ మోసం ఎలా జ‌రుగుతుందంటే.. మొబైల్ ఫోన్‌కు ఏదో కొరియ‌న్ సంస్థ నుంచి మెసెజ్ వ‌స్తుంది. అందులో మీ కొరియ‌ర్ ఎక్క‌డుందో తెలుసుకోవాలంటే ఈ ట్రాకింగ్ లింక్‌ను క్లిక్ చేయండని వ‌స్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే.. వెంట‌నే ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని అల‌ర్ట్ వ‌స్తుంది. ఒక‌వేళ ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారో ఇక మీ ప‌ని అంతే.. మీ ఫోన్‌లోని స‌మాచారం అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఏమ‌ర‌పాటుగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆ యాప్ ఫోన్‌లో ఉన్న‌ మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివ‌రాలన్నింటినీ సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చేరవేస్తుంది. ప్ర‌స్తుతం విదేశాల్లో హ‌ల్చ‌ల్ చేస్తోన్న ఈ స్కామ్ మ‌న వ‌ర‌కు వ‌చ్చే లోపే జాగ్ర‌త్త‌ప‌డ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక యూకే ప్ర‌జ‌ల‌కు అక్క‌డి వొడ‌ఫోన్ సంస్థ ఈ విష‌య‌మై అల‌ర్ట్ చేసింది.. ఇలాంటి మోస‌పూరిత మెసేజ్‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దంటూ ట్వీట్ చేశారు.

వొడ‌ఫోన్ యూకే చేసిన ట్వీట్‌..



 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad