Trending

6/trending/recent

Covid updates: గుడ్‌న్యూస్... ఇండియాలో 2 లక్షల కంటే తక్కువగా కరోనా కొత్త కేసులు

Covid 19 Updates: ఇండియాలో కరోనా కొత్త కేసులు 2 వారాలుగా తగ్గుతున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయి. ఈవారం మరణాలు కూడా తగ్గడం ప్రారంభమైంది. అన్నీ మంచి అంశాలే. అప్‌డేట్స్ చూద్దాం.

Covid 19 Updates: ఇండియాలో కొత్తగా 1,96,427 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరింది. కొత్తగా 3,511 మంది చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 3,07,231కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,26,850 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,40,54,861కి చేరింది. రికవరీ రేటు 89.3 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 20,58,112 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 33 కోట్ల 25 లక్షల 94 వేల 176 టెస్టులు చేశారు. కొత్తగా 24,30,236 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 19కోట్ల 85లక్షల 38వేల 999మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఇండియాలో యాక్టివ్ కేసులు 1,33,934 దాకా తగ్గాయి. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో అత్యధికంగా 4 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 8 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగ్గుతున్నాయి.

Telangana Covid: తెలంగాణలో కొత్తగా 3,043 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 5,56,320కి చేరాయి. కొత్తగా 4,305 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,13,968కి చేరింది. రికవరీ రేటు 92.38 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 21 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,146కి చేరాయి. మరణాల రేటు 0.56 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206 యాక్టివ్ కేసులున్నాయి.

GHMC పరిధిలో కొత్తగా 424 కేసులొచ్చాయి. తెలంగాణలో కొత్తగా 59,709 కరోనా టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య కోటి 45లక్షల 67వేల 606కి చేరింది.

AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 58,835 టెస్టులు చెయ్యగా... కొత్తగా 12,994 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 15,93,821కి చేరింది. కొత్తగా 96 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 10,222కి చేరింది. కొత్తగా 18,373 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 13,79,837కి చేరింది. ప్రస్తుతం 2,03,762 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,86,76,222 టెస్టులు జరిగాయి.

World Covid: ప్రపంచదేశాల్లో కేసుల సంఖ్య బాగా తగ్గుతోంది. కొత్తగా 4,35,016 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 16.79 కోట్లు దాటింది. కొత్తగా 8,691 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 34.86 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.51 కోట్లు ఉన్నాయి. ఇవి కూడా తగ్గుతున్నాయి. అమెరికాలో కొత్తగా 17,328 కేసులు, 294 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 37,563 కొత్త కేసులు... 841 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, అమెరికా, కొలంబియా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత బ్రెజిల్, కొలంబియా, అర్జెంటినా, రష్యా ఉన్నాయి.

ఇండియాలో కరోనా కేసుల వివరాలు


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad