Trending

6/trending/recent

Corona Effect: నేటి నుంచి ఆంధ్రాలో అమల్లోకి కర్ఫ్యూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్.. అమలు బాధ్యత కలెక్టర్లకు..

 Corona Effect: బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కార్ ఇవాళ కర్ఫ్యూ విధింపునకు సంబంధించి మార్గదర్శకాలు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఇవాళ నుంచి మే 18వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, కర్ఫ్యూ నుంచి పలు విభాగాలను మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపునిచ్చారు. టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపునిచ్చారు. కర్ఫ్యూ నుంచి బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లకు మినహాయింపునిచ్చారు. వీటితో పాటు.. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపునిచ్చారు. ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని ప్రభుత్వం ఆదేశించారు. ఇక కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపునిచ్చారు. అయితే, మినహాయింపు పొందిన వారు రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలాఉండగా.. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకునేందుకు సైతం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆంక్షలు విధించింది. రోజంతా 144 సెక్షన్ అమలుచేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని, జిల్లాల కలెక్టర్లు, విభాగాల అధిపతులకు ఆదేశించారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad