Trending

6/trending/recent

CBSE 10th Class results: ఆలస్యం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు..

CBSE 10th Class results 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం క్లారిటీ ఇచ్చింది. 

సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక ఫలితాలను జులైలో విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల నియంత్రణ మండలి ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. పదో తరగతి ఫలితాలను జూన్‌ మూడో వారం 20వ తేదీ నాటికి విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ గతంలో తెలిపింది. అయితే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా డేటా తయారీలో ఆలస్యం కావడంతో ఫలితాలను జులైలో విడుదల చేయనున్నట్లు బోర్డు మంగళవారం స్పష్టంచేసింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు పదో త‌ర‌గ‌తి మార్కుల లెక్కింపు, బోర్డుకు స‌మ‌ర్పించే గ‌డువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

జూన్ మూడో వారం నాటికి ఇంటర్నల్‌ మార్కులను బోర్డుకు సమర్పించాల్సిందిగా అన్ని పాఠశాలలను బోర్డు గతంలో కోరింది. కానీ ఈ ప్రక్రియ ఆలస్యం కానుండటంతో అనుకున్న సమయానికి ఫలితాలు వెల్లడించలేకపోతున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. కాగా.. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రతిభ, అంతర్గత అధ్యయనం ఆధారంగా మార్కుల కేటాయింపు చేపట్టనున్నారు. కాగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ వాయిదా వేసిన 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad